ఉదరాకర్షణాసనంతో మలబద్దకానికి చెక్...

సోమవారం, 25 జూన్ 2018 (09:29 IST)

చాలా మంది మలబద్దకంతో బాధపడుతుంటారు. దీనికి కారణం తగినన్ని నీళ్లు తాగక పోవడం. కడుపులో గ్యాస్ చేరడం. ఇత్యాది కారాణాల వల్ల మలబద్దకం సమస్య ఉత్పన్నమవుతుంది. ఇలాంటి వారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చని గృహ వైద్యులు సూచన చేస్తున్నారు.
Constipation
 
* మలబద్దకం సమస్యతో బాధపడేవారు ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే 4 గ్లాసుల గోరువెచ్చటి నీటిని తాగాలి. ఆ తర్వాత 'ఉదరాకర్షణాసనం' వేసినట్లయితే మలబద్దక సమస్య క్రమంగా తగ్గిపోతుంది. 
 
* ఈ ఆసనం ఎలా వేయాలంటే.. రెండు పాదాలను నేలకు ఆనించి కూర్చుని, రెండు చేతులనూ మోకాళ్లపైన కేంద్రీకరించాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి, వదలి.. కుడికాలును నేలమీద ఆనించి, ఎడమకాలును పొట్టకు ఆన్చి, ఎడమవైపుకు మెడ, ఛాతీ, నడుమును తిప్పాలి. ఇప్పుడు తిరిగీ శ్వాసను పీల్చుకుంటూ రెండు కాళ్లపైన కూర్చోవాలి. 
 
* అలాగే, ఎడమవైపుకు ఎడమకాలు నేలమీద ఆనించి, కుడికాలును పొట్టకు ఆనించి, కుడివైపుకు మెడ, ఛాతీ, నడుమును తిప్పాలి. శ్వాసను పీల్చుకుంటూ యధాస్థానానికి రావాలి. ఇలా కుడి, ఎడమవైపుల్లో 10 సార్లు చేయాలి. 
 
* అనంతరం సుఖాసనంలో కూర్చుని రెండు చేతుల చూపుడు వేళ్లను మడిస్తే వాయుముద్ర ఏర్పడుతుంది. శ్వాస బయటకు, పొట్టలోపలికి తీసుకుంటూ సెకనుకు ఒకసారి, నిమిషానికి 60సార్లు మొదటిరోజు 5 నిమిషాలు, అలా నెల రోజుల చివరికి 15 నిమిషాలపాటు చేసేలా అలవర్చుకోవాలి. ఇలా చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. దీనిపై మరింత చదవండి :  
ఉదరాకర్షణాసనం ఆరోగ్య చిట్కాలు ఉదయం Constipation Udarakarshnasanam Morning మలబద్దకం Home Remedies Health Tip

Loading comments ...

ఆరోగ్యం

news

బేబీ కార్న్‌‌తో గర్భిణీ మహిళలకు మేలే.. నేత్ర సమస్యలు మాయం..

బేబీ కార్న్‌లో లో-కేలోరీలుంటాయి. తద్వారా తేలికగా జీర్ణమవుతాయి. బ్రోకోలీ, క్యాలీఫ్లవర్, ...

news

చేదు మాత్రం మింగేముందు ఐస్ ముక్క నోట్లో వేసుకుంటే...

చాలా మందికి మాత్రలు మింగాలన్నా.. ఏదేని మందు తాగాలన్నా తెగ కష్టపడిపోతారు. వైద్యులు ...

news

ఆవు పాలు తాగితే ఈ అనారోగ్య సమస్యలు దరిచేరవంతే...

ఆవు అంటేనే దేవత. ఆవులో సకల దేవతలు కొలువుంటారు. ఆవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే ...

news

గోంగూర పచ్చడిలో ఏమున్నదంటే?

ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర. గోంగూర అంటే ఇష్టపడే వారు ఎందరో.... గోంగూరతో చట్నీనే కాదు ...