గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (10:56 IST)

పుచ్చకాయ రసంతో తలనొప్పి మాయం.. ఇలా చేయండి?

మనకు ప్రకృతి ప్రసాదించిన పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇవి ప్రతి రుతువులోనూ లభ్యమైనప్పటికీ.. ఎక్కువగా వేసవి కాలంలోనే దొరుకుతాయి. ఈ కాయలను వేసవిలో చల్లదనం కోసం విరివిగా ఆరగిస్తుంటారు. అందుకే పుచ్చకాయను వేసవిక

మనకు ప్రకృతి ప్రసాదించిన పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇవి ప్రతి రుతువులోనూ లభ్యమైనప్పటికీ.. ఎక్కువగా వేసవి కాలంలోనే దొరుకుతాయి. ఈ కాయలను వేసవిలో చల్లదనం కోసం విరివిగా ఆరగిస్తుంటారు. అందుకే పుచ్చకాయను వేసవికాలపు వైద్యుడు అని కూడా పిలుస్తుంటారు. ఇందులోవున్న ఔషధ గుణాలేంటో ఓసారి తెలుసుకుందాం... 
 
వేసవికాలంలో ఎండలో తిరగడం వల్ల విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఇలాంటి వారు పుచ్చకాయలోని ఎర్రటి పదార్థాన్ని రసంలా తయారు చేసుకోవాలి. ఆ రసంలో కలకండ కలుపుకుని సేవిస్తే తలనొప్పి మటుమాయమౌతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
అలాగే, వేసవికాలం ప్రారంభం కాగానే యువతలో చాలా మందికి విపరీతంగా మొటిమలు, పులిపిరులు, చెమట కాయలు పుట్టుకొస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు తరచూ పుచ్చకాయను సేవిస్తుండండి. పుచ్చకాయ రసాన్ని సేవిస్తుంటే శరీరంలో పెరిగిన వేడిని తగ్గిస్తుంది. దీంతో మొటిమలు, పులిపిరులు, చెమటకాయలు మటుమాయమౌతాయి. 
 
పుల్లటి తేపులు వస్తుంటే మిరియాలపొడితోపాటు నల్ల ఉప్పును కలుపుకుని పుచ్చకాయతోపాటు తింటే జీర్ణక్రియ సాఫీగా జరిగి పుల్లటి తేపులు మటుమాయమౌతాయి. అధిక రక్తపోటున్నవారు వేసవి కాలంలో లభించే ఈ పుచ్చకాయలను సేవిస్తుంటే పెరిగే అధిక రక్తపోటు అదుపులో ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పుచ్చకాయ ఆహారంగా తీసుకోవడంతో మనిషి అలసటను దూరం చేసుకుంటాడు. దీంతోపాటు ఇందులో పలు ఔషదీయ గుణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.