గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pyr
Last Updated : మంగళవారం, 10 మార్చి 2015 (15:25 IST)

నెలసరి ముందు వచ్చే సమస్యలేమి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

నెలసరి సరిగ్గా రాకపోవడం కొందరు మహిళల్లో ఉన్న సమస్య అయితే నెలసరి వచ్చే ముందు కూడా కొన్ని సమస్యలు మహిళలను చుట్టుముడుతాయి. ఇలాంటి వాటిని ప్రి మున్సువల్ టెన్షన్ లేదా సిండ్రోమ్ అంటాము. ఇవి చాలా విసుగు పుట్టిస్తాయి.
 
లక్షణాలు : మానసికంగా ఒత్తిడిని కలుగజేయడం, తలనొప్పి, తల తిరిగినట్లు ఉండడం, మాటి మాటికి మూడ్ మారిపోవడం, పనిపైన ధ్యాస పెట్టలేకపోవడం, శరీరం బరువు పెరగడం, కాళ్లు వాపులు రావడం, రొమ్ములలో నొప్పి కలుగడం, మలబద్ధకం, వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బినట్టు ఉండడం వంటి అనే సమస్యలుంటాయి. 
 
ఎవరికి వస్తాయి ? : ఇది సాధారణంగా చాలా మందిలో వచ్చే సమస్యే. హార్మోన్లలో కలిగే మార్పుల కారణంగా ఇలాంటి సమస్యలుంటాయి. దీనికి తోడు ఉప్పు అధికంగా తీసుకోవడం వలన కూడా ఇలాంటి సమస్యలుంటాయి. 
 
పరిష్కారాలు : నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. వేళకు భోజనం చేయాలి. మంచి ఆహారం తీసుకోవాలి. నువ్వులు, పుదీనా, మెంతికూర అధికంగా వాడాలి. పళ్ళ రసాలు, కాయగూరలు మొలకెత్తిన విత్తనాలు తప్పనిసరి, వ్యాయం చేస్తే చాలా మంచిది.