మామిడి పూరీలు

FileFILE
కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... 20 గ్రాములు
మైదాపిండి... 50 గ్రాములు
పంచదారపొడి... 2 టీస్పూన్లు
కారం... అర టీస్పూను
మామిడిపండు రసం.... ఒక కప్పు
నెయ్యి... మూడు టీస్పూన్లు
ఉప్పు... చిటికెడు
నూనె... పూరీలను వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
ముందుగా గోధుమపిండి, మైదాపిండి, పంచదార పొడి, కారం, ఉప్పులను ఒక పాత్రలో వేసి... మామిడి రసం, నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ పూరీల పిండిలా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉన్నట్లయితే సరిపడా నీళ్లను కూడా వాడవచ్చు.

Ganesh|
తడిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీలు వత్తుకోవాలి. నూనె వేడిచేసి అందులో వీటిని వేసి.. మామూలు పూరీల్లాగా కాకుండా మరి కాస్త ఎక్కువసేపు వేయించండి. వేడివేడిగా ఉండే ఈ పూరీలను మ్యాంగో, ఆపిల్ స్వీట్ చట్నీలతో తింటే మరింత రుచిగా ఉంటాయి.


దీనిపై మరింత చదవండి :