రోటీ పన్నీర్ కూర

FileND
కావలసిన పదార్థాలు :
పన్నీర్... 200 గ్రాములు
వెన్న... 50 గ్రాములు
ఉల్లిపాయులు... 50 గ్రాములు
పెరుగు... ఒక కప్పు
అల్లం... పది గ్రాములు
పచ్చిమిర్చి.. పది గ్రాములు
కారం.. అర టీస్పూన్
పసుపు.. సరిపడ
టమోటోలు... రెండు
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
Ganesh|
ముందుగా బాణలిలో వెన్న బాగా కాగనివ్వాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి దోరగా వేయించాలి. అందులోనే అల్లం, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, కారం, పసువు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇందులో పెరుగు పోసి కలియబెడితే గ్రేవీ తయారు అవుతుంది. ఇప్పుడు ఆ గ్రేవీలో తురిమిన పన్నీర్, ఉప్పు కలపాలి. అంతే... రోటీ పన్నీర్ కూర రెడీ అయినట్లే...! దీన్ని వేడివేడి రోటీలతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.


దీనిపై మరింత చదవండి :