బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By CVR
Last Updated : సోమవారం, 8 డిశెంబరు 2014 (17:12 IST)

పుష్కలమైన పోషకాల కూర 'గ్రీన్‌ ఫిష్‌ మసాలా'

కావలసిన పదార్థాలు :
కొరమీను  - అర కేజీ
పాలకూర - ఒక కట్ట
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - మూడు
అల్లం వెల్లుల్లి - రెండు టీ స్పూన్లు
కరివేపాకు - నాలుగు రెమ్మలు
కొత్తిమీర - ఒక కట్ట
టొమోటో గుజ్జు - ఒక కప్పు
కారం - రెండు టీ స్పూన్లు.
పసుపు - ఒక టీ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - ఆరు టీ స్పూన్లు
గరంమసాలా - ఒక టీ స్పూన్
 
మసాలా దినుసులు :
పచ్చికొబ్బరి - చిన్న ముక్క
లవంగాలు - 4
దాల్చిన చెక్క - రెండు ముక్కలు
ధనియాలపొడి - రెండు టీ స్పూన్లు
 
తయారీచేయండి ఇలా: మొదట చేపముక్కలు కడిగి పసుపు, ఉప్పు పట్టించాలి. మరోవైపు ఉల్లి, పచ్చిమిర్చి సన్నని ముక్కలుగా కోయాలి. మసాలా దినుసులు, పాలకూర మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మందపాటి గిన్నెలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఉల్లిముక్కలు, కరివేపాకు వేసి మగ్గాక అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి. 
 
పాలకూర మసాలా వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత టొమాటో గుజ్జు వేసి కాస్త ఉడికాక చేపముక్కలు వేసి మరికాస్త పసుపు, కారం, పచ్చిమిర్చి వేసి ఓ సారి గిన్నెను తిప్పి నీరంతా ఇగిరేవరకూ తక్కువ మంటమీద ఉడికించాలి. మంచివాసన రాగానే కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే  గ్రీన్‌ ఫిష్‌ మసాలా రెడీ...! ఇందులో అటు ఆకు కూర పోషకాలు, ఇటు చేపల పోషకాలు పుష్కలంగా లభ్యమవుతాయి. రుచి రుచి... శక్తికి శక్తినూ.