గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By chitra
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2016 (17:00 IST)

వర్షాకాలంలో వెరైటీ సూప్.. మిక్స్‌డ్ వెజ్ సూప్...

వర్షాకాలంలో వేడి వేడిగా సూప్ తాగితే ఎంత హాయిగా ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటి వాటిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిక్స్‌డ్ వెజ్ సూప్ టేస్ట్ చేయండి.

వర్షాకాలంలో వేడి వేడిగా సూప్ తాగితే ఎంత హాయిగా ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటి వాటిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిక్స్‌డ్ వెజ్ సూప్ టేస్ట్ చేయండి. 
 
కావలసిన పదార్థాలు : 
క్యారెట్, క్యాబేజీ, బీన్స్, కాలీఫ్లవర్, బంగాళాదుంప తరుగు : రెండు కప్పులు 
నిమ్మరసం - రెండు స్పూన్‌లు
సోయా సాస్, చిల్లీ సాస్ - ఒక టీ స్పూన్ 
వెనిగర్ - ఒక టీ స్పూన్ 
ఉప్పు- సరిపడా
మిరియాల పొడి - తగినంత 
 
తయారీ విధానం: 
కూరగాయల తరుగును నాలుగు కప్పుల నీటితో చేర్చి 20 నిమిషాల పాటు సన్నని సెగపై ఉడికించాలి. బాగా ఉడికాక ఆ నీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. అందులో ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం చేర్చి వేడి వేడిగా కార్న్ స్నాక్స్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది. లేకుంటే వడగట్టిన కూరగాయల రసంలో సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ చేర్చి కొద్దిగా మరగనిచ్చి హాట్ హాట్‌గా సర్వ్ చేయొచ్చు.