శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By chitra
Last Updated : గురువారం, 24 మార్చి 2016 (15:59 IST)

కూరగాయలతో కమ్మని సాంబారు ఎలా చేయాలంటే?

అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసుకుని, సాంబార్ చేసుకుంటె కమ్మటి రుచితో పాటు మంచి పోషక విలువలు కూడా మనకు లభిస్తుంది. అలాంటి సాంబార్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం! ఇప్పుడు ములక్కాయ ఆలుగడ్డ సాంబార్ తయారీ గురించి నేర్చుకుందాం!
 
కావలసిన పదార్థాలు:
కందిపప్పు: 1 గ్లాసు
ఆలు గడ్డ : 2
సాంబార్ పొడి : 2 స్పూన్స్
ములక్కాయలు, వంకాయలు: 1 కప్పు
వేరుశనగ పప్పు:  1 కప్పు
పచ్చికొబ్బరి: 1/2 కప్పు 
చింతపండు పులుసు : 1  కప్పు
పసుపు : తగినంత 
కారం : సరిపడా
ఉప్పు : తగినంత
కరవేపాకు : 2 రెమ్మలు
కొత్తిమీర : 2 రెమ్మలు
ఇంగువ : చిటికెడు
పోపు గింజలు : సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా కందిపప్పు కడిగి కుక్కర్‌లో ఉడికించి పెట్టుకోవాలి. ఇంకో పాత్రలో తరిగి ఉంచిన ములక్కాయలు, ఆలుగడ్డ ముక్కలు, వేరుశనగపప్పు వేసి ఉడికించిపెట్టుకోవాలి. తరువాత ఇంకొక గిన్నెలో పాత్ర పెట్టి అందులో నూనె వేసి, శెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి తాలింపు పెట్టుకోవాలి. అందులో ఉడికించిన పప్పు, ఉర్లగడ్డలు, వంకాయ ముక్కలు వేసి కలియబెట్టాలి. తరువాత సాంబార్ పొడి వేసి, కారం, తగినంత ఉప్పు, చింతపండు పులుసు, కొంచెం నీరు పోసి బాగా మరగ నివ్వాలి. అంతా ఉడికిన తరువాత పచ్చికొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు వేసి మంటను ఆర్పేయాలి. ఎంతో రుచిగా వుండే ములక్కాయ ఆలుగడ్డ సాంబార్ రెడీ.