శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By CVR
Last Updated : శనివారం, 10 జనవరి 2015 (17:39 IST)

చలి చీమలకు కర్పూరంతో చెక్...!

సాధారణంగా ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినప్పటికీ కొన్ని క్రిమి, కీటకాలు, ఎలుకలు, పిల్లులు వంటి జీవాలు దారితప్పో లేక, ఆవాసాల వేటలో భాగంగానో ఇళ్లలోకి వస్తుంటాయి. అయితే ఆవిధంగా వచ్చే వాటిని మనం తరిమికొడుతుంటాము. ఆ కోవలో చలికాలంలో ఇళ్లలోకి చీమలు ఎక్కువగా వస్తుంటాయి. 
 
ఇళ్లలో చలి చీమలు వంట గదిలోను, చెత్తబుట్ట వద్దను, తీయటి తినుబండారాలు పెట్టిన చోట గుట్టలు గుట్టలుగా చేరిపోతాయి. వాటిని ఊడ్చి బయట వేసినా కాసేపటిలో అవి మళ్లీ అక్కడ చేరుతాయి. అటువంటి సమయంలో దేవునికి హారతి ఇచ్చే కర్పూరంను గుప్పెడు తీసుకుని చీమలు ఉన్న చోట, ఇంటిలో మూలల్లో వేస్తే సరి. కర్పూరం వాసనకు అర గంటలో చీమలు అన్నీ కనిపించకుండా పోతాయి. మళ్లీ ఆ వాసన పోయేంత వరకు చేరవు.