గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By Selvi
Last Updated : గురువారం, 4 సెప్టెంబరు 2014 (17:35 IST)

అలంకరణే కాదు.. అదృష్టం చేకూరాలంటే.. ఈ ప్లాంట్స్ పెంచండి.!

అలంకరణతో పాటు అదృష్టం చేకూరాలంటే ఈ ప్లాంట్స్‌ను ఇంట్లో పెంచాల్సిందే. గతంలో అందరూ పవిత్రంగా భావించే తులసి మొక్క మాత్రమే ప్రతి ఇంటా వుండేది. ఇంటికి మంచి ఎనర్జీని కలిగిస్తుందని పవిత్రతను చేకూరుస్తుందని ఈ తులసి మొక్కను పెరటిలో పూజలు చేస్తారు. అయితే సమాచార వ్యవస్థ బాగా అభివృధ్ధి చెందటంతో ఇంటర్నెట్‌లు చూసేవారంతా ప్రపంచ వ్యాప్తంగా ఇపుడు లక్కీ బాంబూ మొక్కలను తమ ఇండ్లలో పెడుతున్నారు. మన ప్రాంతాలలో కూడా ఇండ్లలో ఈ మొక్కలు పెంచుతున్నారు. 
 
1. లక్కీ బాంబూ ప్లాంట్స్ - ఇవి చైనాలో పుట్టినవైనప్పటికి ఇండియాలో ఫెంగ్‌షుయ్‌లో భాగంగా అతిగా పెంచుతున్నారు. లక్కీ బాంబూ ప్లాంట్ అంటే నాలుగు వెదురు బద్దలు ఒక ఎర్ర రిబ్బన్‌తో కట్టి వుంటాయి. ఇది కుటుంబంలో ఐకమత్యానికి చిహ్నంగా భావిస్తారు. దీనినే అలంకరణగా కూడా పరిగణిస్తారు. 
 
2. ఫోర్ లీఫ్ క్లోవర్ - ఇది అమెరికాలో బాగా ప్రసిద్ధి చెందినది. ఇది ఒక అరుదైన మొక్క. నాలుగే ఆకులుంటాయి. ఈ మొక్క కనపడితే చాలు మంచి జరుగుతుందనే నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. 
 
3. తులసి మొక్క - తులసి మొక్కను లక్ష్మీ దేవిగా భావించి పూజలు చేస్తారు. ఆకులు ఆహారాన్ని, దుస్తులను మొదలైనవాటిని శుభ్రం చేయటానకి ఉపయోగిస్తారు. నెగెటివ్ ఎనర్జీని తొలగిస్తుందని హిందువులు భావిస్తారు. 
 
4. స్నేక్ ప్లాంట్ - ఈ మొక్క గాలిలో వున్న విషవాయువులను పీలుస్తుందని చెపుతారు. మంచితేమను కలిగి వుండి దాని పరిసరాలలో సహజమైన తేమను ఏర్పరుస్తుంది. ఇది లక్ మాత్రమే కాక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. 
 
5. మనీ ప్లాంట్ - అదృష్టాన్నిచ్చే మొక్కలలో ఇది పురాతన మొక్క. శీటిని ఒక బాటిల్ లోని నీటితో కూడా పెంచుతారు. ఇవి ఎక్కడపడితే అక్కడ దొరుకుతూనే వుంటాయి. వేగంగా పెరుగుతాయి. మొక్క కిందనుండి పైకి పాకుతూ వుంటేనే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.