మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 5 జులై 2015 (14:47 IST)

సముద్రంలోకి కొట్టుకుపోయిన చిన్నారి.. రక్షించిన స్థానిక మెరైన్ పోలీసులు (వీడియో)

రబ్బరు టబ్బుతో 10 నెలల చిన్నారి సముద్రంలోకి కొట్టుకుపోయిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. విహారానికి సముద్రపు ఒడ్డుకు వెళ్లిన చిన్నారి కుటుంబ సభ్యులు, రబ్బర్ టబ్‌లో చిన్నారిని పడుకోబెట్టి నీళ్లలో ఆడుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో చిన్నారిని మరిచిపోయారు. వారు ఆట సందడిలో ఉండగా, సముద్రపు అలలు చిన్నారిని నెమ్మదిగా నీళ్లలోకి లాక్కెళ్లిపోయాయి. 
 
అయితే రబ్బర్ టబ్ దూరంగా వెళ్లిపోయాక చూసిన ఇతరులు చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే అది దూరంగా వెళ్లిపోవడంతో స్థానిక మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. విశేషం ఏమిటంటే, పోలీసులు రంగ ప్రవేశం చేసినంత వరకు చిన్నారి కుటుంబ సభ్యులకు అసలు విషయం తెలియదట. కిలో మీటర్ దూరం వెళ్లిపోయిన చిన్నారి వద్దకు వెళ్లిన మెరైన్ పోలీసులు, రక్షించి కుటుంబ సభ్యులకు క్షేమంగా అందజేశారు.