శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Eswar
Last Modified: శనివారం, 26 జులై 2014 (14:34 IST)

స్త్రీల జననాంగాలను వీడియో తీసిన డాక్టర్... రూ.1140 కోట్ల జరిమానా

వైద్యోనారాయణో హరీ అంటారు. అంటే డాక్టర్లు దేవుళ్లతో సమానం అని. అందుకే స్త్రీలు ‘ఆడ – మగా’ ఇలా ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా మోహమాట పడుకుండా ఎక్కడ ఏ సమస్య ఉన్నా  అన్నీ చెప్పుకుంటారు. అదే గైనిక్ సమస్యలతో వెళ్లే స్త్రీలు అయితే డాక్టర్‌లో ఒక అమ్మనో.. ఓ అక్కనో.. ఓ చెల్లినో చూసుకుని అన్నీ చెప్పి శరీరంలోని తమ వ్యక్తిగత భాగాలను చూపించడానికి కూడా  ఇబ్బందిపడరు. అయితే అమెరికాలో ఓ డాక్టర్ దీన్నే అదనుగా చేసుకుని ఆడవారి మర్మాయవాలను ఫోటోలు తీసి పైశాచిక ఆనందం పొందేవాడు.
 
ఎవరీ డాక్టర్ 
అమెరికాలో బాల్డిమోర్‌లోని హాప్‌కిన్స్ ఆసుపత్రిలో పేరొందిన గైనకాలజిస్ట్ లెవీ. పాతికేళ్లు సుధీర్ఘ అనుభవం.. ఆ డాక్టర్ హస్తవాసి చాలా మంచిది. రోగిని టచ్ చేస్తే చాలు ఆరోగ్యవంతుడుగా బయటకొస్తాడనే ప్రచారం ఉంది. ఇక గైనిక్ సమస్యలున్న ఆడవారికైతే ఈయనో ఆపద్భాందవుడు. కానీ ఈ డాక్టరు ఓ పిచ్చి ఉంది. తన దగ్గరకు వచ్చే మహిళా పేషెంట్స్  జననాంగాలను ఫోటోలు, వీడియోలు తీసేవాడు.

2005 నుంచి ఇలా సుమారు 7వేల మంది మహిళలు  ఫోటోలు తీసాడు ఈ డాక్టర్ లేవీ .‘స్టెతస్కోప్‌లో అతి చిన్న కెమెరాతో మహిళలకు సెల్విక్ టెస్ట్‌లు నిర్వహించేవాడు. ఈ డాక్టర్‌ వైఖరిపై అతని అసిస్టెంట్‌ డాక్టర్‌కు అనుమానం వచ్చి ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.
 
దీంతో లెవీపై యాజమాన్యం విచారణ మొదలుపెట్టింది. తన బండారం బయటపడటంతో 2013లో లెవీ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ డాక్టర్ చేసిన అకృత్యాలకు ఇప్పుడు ఆసుపత్రి ‘మూల్యం’ చెల్లించాల్సి వస్తోంది. మొత్తం రు. 1140 కోట్ల పరిహారాన్ని చెల్లించబోతోంది. అమెరికా చరిత్రలో ఓ డాక్టర్ చేసిన నిర్వాకానికి ఆసుపత్రి యాజమాన్యం చెల్లిస్తున్న పరిహారాల్లో ఇదే అతి పెద్దది.