శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 25 మే 2015 (17:40 IST)

గ్వాటెమాలలో 16 యేళ్ళ యువతిపై దాడి.. సజీవ దహనం

సెంట్రల్ అమెరికా దేశంలోని గ్వాటెమాలలో దొంగల ముఠాకు చెందిన ఓ యువతిని ఓ మృతుని కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టి గాయపరిచి.. సజీవ దహనం చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ యువతి వయస్సు 16 యేళ్లు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... గ్వాటెమాల నగరానికి సమీపంలోని రియో బ్రావోలో ఓ టాక్సీ డ్రైవర్‌ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో ముఠాలో ఓ 16 యేళ్ళ యువతి కూడా ఉంది. ఈ యువతిని అనుమానించిన మృతుడి బంధువులు, మరికొందరు కలిసి ఆమెను తీవ్రంగా కొట్టారు. రక్తం కారుతున్నా ఏ మాత్రం కనికరం లేకుండా దాడి చేశారు. అంతటితో ఆగని వారు ఆమెను సజీవ దహనం చేశారు. 
 
కాగా, ఈ ఘటన మొత్తాన్ని కొందరు కెమెరాల్లో చిత్రీకరించారు. ఈ దేశంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయని అక్కడి మీడియా వెల్లడించింది. ఎక్కువగా పేద వర్గాల్లోనే చోటు చేసుకుంటాయని తెలిపింది. కాగా, ఆ యువతిని రక్తం వచ్చేలా కొడుతున్న ఆ దుర్మార్గులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురు పోలీసులను కూడా అక్కడి వారు అడ్డుకోవడం విచారకరం.