శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (17:58 IST)

మయన్మార్‌ వాటర్ ఫెస్టివల్- 285 మంది మృతి.. 1073 మందికి గాయాలు..

మయన్మార్‌లో ప్రతీ ఏడాది సంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ వాటర్ ఫెస్టివల్. ఈ పండుగలో ఈ ఏడాది విషాదం చోటుచేసుకుంది. ప్రతి ఏడాది కొత్త సంవత్సరంలో వేసవి ముగిసే సమయంలో ఈ ఫెస్టివల్‌ను అట్టహాసంగా జరుపుకుంటారు

మయన్మార్‌లో ప్రతీ ఏడాది సంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ వాటర్ ఫెస్టివల్. ఈ పండుగలో ఈ ఏడాది విషాదం చోటుచేసుకుంది. ప్రతి ఏడాది కొత్త సంవత్సరంలో వేసవి ముగిసే సమయంలో ఈ ఫెస్టివల్‌ను అట్టహాసంగా జరుపుకుంటారు. అయితే నాలుగు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో 285 మంది మృతి చెందారు. మరో 1073 మంది గాయపడ్డారు.  
 
మయన్మార్‌లో జరిగే ఈ ఫెస్టివల్‌ను థింగ్యాన్ అని పిలుస్తారు. బౌద్ధాన్ని అనుసరించేవారు ఈ వేడుకను జరుపుకుంటారు. గత సంవత్సరం చేసిన పాపాలు కొత్త సంవత్సరంలో నీటితో కడిగేసుకుంటే పోతాయనే విశ్వాసంతో ఈ వేడుక జరుగుతుంది. అయితే గత ఏడాది ఈ వేడుకలో 272 మంది మరణించగా, ఈ ఏడాది దారుణంగా 285 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి 1,200 క్రిమినల్ కేసులు నమోదైనాయని జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.