శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 18 జులై 2016 (13:41 IST)

గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు: వియత్నాంలో ప్రతి 100 మంది టీనేజి అమ్మాయిల్లో ముగ్గురు గర్భం!

ప్రపంచ వ్యాప్తంగా అబార్ష‌న్లు చేయించుకుంటున్న టీనేజి అమ్మాయిల సంఖ్య రానురాను పెరుగుతున్నట్టు ఒక ప్ర‌భుత్వ ఆరోగ్య స‌ర్వే వెల్ల‌డించింది. న‌గ‌రాల్లో పెరుగుతున్న స్వేచ్ఛా వాతావ‌ర‌ణం ఇందుకు ఒక ముఖ్య‌కార‌ణ

ప్రపంచ వ్యాప్తంగా అబార్ష‌న్లు చేయించుకుంటున్న టీనేజి అమ్మాయిల సంఖ్య రానురాను పెరుగుతున్నట్టు ఒక ప్ర‌భుత్వ ఆరోగ్య స‌ర్వే వెల్ల‌డించింది. న‌గ‌రాల్లో పెరుగుతున్న స్వేచ్ఛా వాతావ‌ర‌ణం ఇందుకు ఒక ముఖ్య‌కార‌ణంగా తెలుస్తోంది. వియత్నాంలో ఏడాదికి దాదాపు ఆరు వేల మంది టీనేజి అమ్మాయిలు అబార్షన్లు చేయించుకుంటున్నారని అక్కడి జనరల్ ఆఫీస్ ఫర్ పాపులేషన్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ వెల్లడించింది. 
 
2015 సంవత్సరంలో మొత్తం దేశంలో 2.80 లక్షల అబార్షన్లు జరిగితే వాటిలో 2 శాతం టీనేజి అమ్మాయిలే ఉండడం గమనార్హం. ఈ లెక్కలన్నీ కేవలం ప్రభుత్వాస్పత్రులలో సేకరించినది మాత్రమే పూర్తి స్థాయిలో సేకరిస్తే ఈ లెక్క ఇంకా పెరుగుతుందని వారంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేయించుకోవాలని టీనేజర్లు ఎక్కువశాతం ప్రైవేటు ఆసుపత్రివైపే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. 
 
గత కొన్నేళ్లుగా అబార్షన్ల సంఖ్య తగ్గుతున్ననేపథ్యంలో వియత్నాంలో మాత్రం టీనేజిలోనే గర్భం దాలుస్తున్న అమ్మాయిల సంఖ్య విపరీతంగా పెరుగుతోందట. ప్రతి వంద మంది టీనేజి అమ్మాయిలలో ముగ్గురు గర్భం దాలుస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.