గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (21:40 IST)

ఐఎస్ఐఎస్ అరాచకాలలో ఏడుగురు భారతీయులు... మరో ఆరుగురు మృతి

ఐఎస్ఐఎస్ పేరు చెబితే అగ్రరాజ్యాలు తలలు పట్టుకుంటాయి. ఆ సంస్థ చేసే అరాచకాలు అలా ఉంటాయి. అయితే ఆ పాపాల్లో భాగస్తులుగా ఏడుగురు ఇండియా నుంచి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. అక్కడికెళ్లి ఉగ్రవాదులుగా మారిన భారతీయులు ఉన్నారని నిఘావర్గాలు చెబుతున్నాయి. 
 
ఇలా భారతదేశం నుంచి వెళ్లిన వారిలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందినవారు ఉన్నారని తెలిపింది. ఈ ఏడుగురు కాకుండా మరో ఆరుగురు భారతీయులు ఐఎస్ఐఎస్ తరపున పోరాడుతూ మృత్యువాత పడ్డారని నిఘావర్గాలు వెల్లడించాయి. మరణించిన వారిలో ముగ్గురు ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన వారు కాగా, ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వారు, ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడని నిఘావర్గాలు చెప్పాయి. 
 
బతికి ఉన్న ఏడుగురిలో ఒకడ్ని మాత్రమే ఐఎస్ఐఎస్ పోరాటంలో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. మిగిలిన ఆరుగురు వంటవాళ్లు, డ్రైవర్లు, పనివాళ్లుగా కుదురుకున్నట్టు నిఘావర్గాలు పేర్కొన్నాయి. కాగా, తెలంగాణ నుంచి సిరియా వెళ్లేందుకు 17 మంది అనుమతి కోరగా, వారంతా ఐఎస్ఐఎస్ లో చేరే ప్రమాదం ఉందని భావించిన అధికారులు వారి అనుమతి నిరాకరించినట్టు నిఘావర్గాలు వెల్లడించాయి.