గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (06:10 IST)

250 కిలోల బాంబు.. 70 వేల మంది తరలింపు.. నిర్వీర్యానికి 8 గంటలు

అది మామూలు బాంబు కాదు. ముగ్గురు మనుషులు ప్రయత్నించినా ఎత్తలేనంత బరువైన బాంబు. 65 ఏళ్లు పేలకుండా పడి ఉన్న ఆ బాంబు బరువు 250 కేజీలు. కనుగొన్న తర్వాత దాని శక్తిని అంచనా వేస్తే 1.5 కిలోమీటర్ల చుట్టూ ప్రదేశం భస్మమవుతుందని తేలింది. దీంతో ఆ దేశ చరిత్రలో అతి

అది మామూలు బాంబు కాదు. ముగ్గురు మనుషులు ప్రయత్నించినా ఎత్తలేనంత బరువైన బాంబు. 65 ఏళ్లు పేలకుండా పడి ఉన్న ఆ బాంబు బరువు 250 కేజీలు. కనుగొన్న తర్వాత దాని శక్తిని అంచనా వేస్తే 1.5 కిలోమీటర్ల చుట్టూ ప్రదేశం భస్మమవుతుందని తేలింది. దీంతో ఆ దేశ చరిత్రలో అతిపెద్ద ప్రజా తరలింపునకు రంగం సిద్ధమైపోయింది. ఆ  బాంబు పేలకుండా నిర్వీర్యం చేయాలంటే కనీసం 8 గంటలు పడుతుంది. 
 
గ్రీసులో బయటపడిన రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబును నిర్వీర్యం చేయడానికి  తెస్సాలోనికి అనే పట్టణం నుంచి సుమారు 70 వేల మందిని వేరే ప్రాంతాలకు తరలించే ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. 250 కిలోలున్న ఈ బాంబును గత వారం రోడ్డు పనుల సందర్భంగా గుర్తించారు. తొలుత 20 అంబులెన్స్ లలో 300 మంది వికలాంగులను, రోగులను తరలించారు.
 
బాంబు ఉన్న ప్రదేశానికి 1.9 కి.మీ పరిధిలో ఉన్న ప్రజలందరినీ ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల కల్లా తరలించాల్సి ఉంది. గ్రీస్‌లో జన సమ్మర్థ ప్రాంతాల్లో ఇంతకు ముందెప్పుడూ ఇంత పెద్ద బాంబును గుర్తించలేదని, అందుకే ప్రజల తరలింపు తప్పట్లేదని ఓ అధికారి తెలిపారు. బాంబును నిర్వీర్యం చేయడానికి సుమారు 8 గంటలు పట్టొచ్చని మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం వేల సంఖ్యలో పోలీసులను రంగంలోకి దించారు.