Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సీటు విషయంలో వాగ్వాదం... విమానం దిగేటప్పుడు ముష్టిఘాతాలు.. (Video)

శుక్రవారం, 12 మే 2017 (10:28 IST)

Widgets Magazine
Southwest Airlines flight

సాధారణంగా మన ఆర్టీసీ బస్సుల్లో సీటు కోసం కొట్టుకోవడం, జుట్లుజుట్లు పట్టుకోవడం వంటి సంఘటనలు చూస్తుంటాం. ఇపుడు అదే తరహా ఘటన ఒకటి విమానంలో జరిగింది. ఇద్దరు ప్రయాణికుల మధ్య సీటు కోసం వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వారిద్దరు ఘర్షణ పడ్డారు. చివరకు విమానం దిగే సమయంలో మరోమారు ఘర్షణ పడి.. ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఈ ఘటన తాజాగా సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌ లైన్స్‌‌కు చెందిన విమానంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... డల్లాస్‌ నుంచి ఆక్లాండ్‌‌కు వెళ్తుండగా ఇద్దరు ప్రయాణికులు సీటు కోసం వాదించుకున్నారు. ఆ తర్వాత శాంతించారు. మార్గమధ్యంలో కాలిఫోర్నియాలోని బర్బంక్‌ బాబ్‌‌హోప్‌‌ ఎయిర్‌ పోర్టులో ఆగింది. ప్రయాణికులు కిందకు దిగుతుండగా ఇద్దరు యువకులు ఒక్కసారిగా కలబడ్డారు. ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు.
 
దీనిని చూసి ఆపేందుకు వచ్చిన ప్రయాణికులను కూడా వారు కనికరించలేదు. అమాంతం వారితోపాటు ప్రత్యర్థిని సీట్ల కింద పడేసిన ఓ యువకుడు, ప్రత్యర్థిపై పిడిగుద్దులు కురిపించాడు. దీనిని వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. దీనిపై విమాన సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

3 అడుగుల గుంతలో ప్రాణాలతో ఉండగానే 19 ఏళ్ల యువతిని పూడ్చి పెట్టారు (Video)

తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ భవనాన్ని అడ్డుకున్నందుకు 19 యేళ్ళ ...

news

ప్రధానితో జగన్ భేటీ.. టీడీపీ వెన్నులో వణుకు... కాళ్ల మీద పడటం చూశారా : కావూరి ప్రశ్న

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న వైకాపా అధినేత వైఎస్. జగన్ ...

news

ప్రేమించవు సరే.. కనీసం పెళ్లి కూడా చేసుకోవా? రోజాపై ప్రేమోన్మాది దాడి...

సాఫ్ట్‌వేర్ టెక్కీపై ఓ ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ప్రేమను నిరాకరించడమే కాకుండా ...

news

నిషిత్ కారు ప్రమాదాన్ని వీడియో తీసిన వ్యక్తి.. మీడియాకు అమ్మేందుకు యత్నాలు

ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి ...

Widgets Magazine