Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సెల్‌ఫోన్ చార్జ్ కోసం దుకాణంలోకి వెళ్లిన యువతి, తలుపు తాళం వేసి రేప్...

శుక్రవారం, 17 నవంబరు 2017 (16:01 IST)

Widgets Magazine
victim

కామాంధులు ఎప్పుడు ఎలా విరుచుకుపడతారో తెలియదు. ఇంగ్లండులో ఓ యువతి తన సెల్ ఫోన్ చార్జ్ అయిపోవడంతో పక్కనే వున్న షాపును చూసి అక్కడ చార్జింగ్ చేసుకునేందుకు లోపలికి వెళ్లింది. అంతే.. అద అదనుగా ఆ షాపు యజమాని దుకాణానికి తాళం వేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాలను చూస్తే.... స్వప్నిల్ కులత్ అనే వ్యక్తి మాంచెస్టర్లో ఓ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడి దుకాణంలోకి ఓ యువతి తన సెల్ ఫోన్ చార్జ్ అయిపోయిందనీ, అవకాశమిస్తే కొద్దిసేపు చార్జ్ చేసుకుని వెళతానని అభ్యర్థించింది. 
 
సర్లే... దాందేముంది, చార్జ్ చేసుకోండి అని ఆమెను లోపలికి ఆహ్వానించాడు. ఆమె అలా వెళ్లి ప్లగ్‌లో ఫోన్ చార్జర్ పెట్టి చార్జ్ చేసేలోపే ఇతడు లోపలివైపు తన దుకాణం షట్టర్ క్లోజ్ చేసి లోపల తాళం కూడా వేసేశాడు. ఈ హఠత్పరిణామానికి భీతిల్లిపోయిన యువతి కేకలు వేసినా ఫలితంలేకపోయింది. ఆమెను కత్తితో బెదిరించడమే కాకుండా కేకలు వేస్తుంటే విచక్షణరహితంగా కొట్టాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆమె ప్రతిఘటిస్తుండగా ప్రక్కనే వున్న దుడ్డుకర్రతో ఆమెను ఇష్టమొచ్చినట్లు చితకబాదాడు. తీవ్ర గాయాల పాలయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ముందు ప్రవేశపెట్టగా అతడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళ భర్తకు జైలుశిక్ష... లగ్జరీ కారు దిగుమతి కేసులో...

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె భర్త ఎం ...

news

టెక్కీని మోసం చేసిన దొంగ బాబా.. గతజన్మలో నేనే నీ భర్త..

సాంకేతికత ఎంత పెరిగినా.. ఉన్నత చదువులు చదివినా.. బాబాలను నమ్మి మోసపోవడం ప్రస్తుతం ...

news

దొంగగా మారిన టెక్ కంపెనీ ఉద్యోగి.. దోపీడికి వెళ్లి కత్తి చూపెట్టి.. 50మందిపై అత్యాచారం

దొంగతనం చేసే ఓ దొంగ.. కత్తిని చూపి డబ్బు, నగలతో పాటు మహిళల శీలాన్ని కూడా దోచుకున్నాడు. ...

news

అమరావతి నిర్మాణానికి ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ...

Widgets Magazine