శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (15:09 IST)

లిప్‌ లాక్ మంచిదే... నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తల వెల్లడి

లిప్ లాక్‌ కిస్‌లు మంచిదేనంటున్నారు నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు. వారు ఇటీవల ముద్దులపై పరిశోధనలను జరిపారు. ఆ పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
 
ఈ మేరకు వారు మాట్లాడుతూ పది సెకండ్ల పాటు పెట్టే ఫ్రెంచ్ కిస్ వల్ల ఎనిమిది కోట్ల బ్యాక్టీరియాలు ఒకరి నుండి మరొకరిలోకి ప్రవేశిస్తాయట. అయితే వాటిలో ఎక్కువ బ్యాక్టీరియాలు మంచివేనని వారు అంటున్నారు.
 
నెదర్లాండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ అప్లైడ్ సైంటిఫిక్ రీసెర్చ్‌కు చెందిన శాస్తవేత్తలు 21 జంటలను వారు పెట్టుకున్న ముద్దు అలవాటు పైన ప్రశ్నించారు. వారి వద్ద గత ఏడాదిగా తరుచూ ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంటున్నారో, అలాగే చివరిసారి ఎప్పుడు ముద్దు పెట్టుకున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం కచ్చితంగా పదిసెకండ్ల పాటు ముద్దు పెట్టుకోవాలని జంటలకు సూచించారు. 
 
సదరు జంటలు పది సెకండ్ల పాటు ముద్దు పెట్టుకునే ముందు, ఆ తర్వాత... వారి నాలుకల నుండి, లాలాజలం నుండి శాస్త్రవేత్తలు బ్యాక్టీరియా శాంపిల్స్ తీసుకొని పరిశోధన చేశారు. ఈ పరిశోధనల ద్వారా ముద్దు మంచిదేనని తేలిందని వారు పేర్కొన్నారు.