శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2016 (17:27 IST)

అతడు ఆత్మహత్య చేసుకున్నాడు... ఎలాగో తెలుసా...?

జీవితంపైన విరక్తి చెందినవారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని సైకాలజిస్టులు చెపుతుంటారు. ఇలా ఆత్మహత్యలకు పాల్పడేవారు కూడా భిన్న పద్ధతులు పాటిస్తుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. ఐతే టెక్సాస్‌లో ఓ

జీవితంపైన విరక్తి చెందినవారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని సైకాలజిస్టులు చెపుతుంటారు. ఇలా ఆత్మహత్యలకు పాల్పడేవారు కూడా భిన్న పద్ధతులు పాటిస్తుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. ఐతే టెక్సాస్‌లో ఓ యువకుడు భిన్నమైన పద్ధతిని అనుసరించాడు. తను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న అతడు, కోబ్రా(నాగుపాము)ను పట్టుకున్నాడు. 
 
ఆ పామును పట్టుకుని కారెక్కి డ్రైవ్ చేసుకుంటూ కొంత దూరం వెళ్లాడు. ఆ తర్వాత కారు ఆపి దానితో వళ్లంతా కాట్లు వేయించుకుని తద్వారా ప్రాణాలు విడిచాడు. కారులో చనిపోయిన యువకుడిని చూసిన పోలీసులు అతడు గుండెపోటుతో చనిపోయాడనుకున్నారు. కానీ కారణం అది కాదని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. అతడి శరీరం పైన పాము కాట్లు ఉండటంతో అతడు పాము కాటు వల్ల మృతి చెందినట్లు తెలుసుకున్నారు. 
 
ఐతే కారులో పాము లేకపోవడంతో అతడు మృతి చెందిన ప్రదేశం తెలుసుకుని వెళ్లారు. కానీ అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత సమీప ప్రాంతంలో ఓ నాగుపాము చచ్చిపడి ఉండటాన్ని గమనించారు. దీనికితోడు అతడి సెల్ ఫోనులో చివరి సందేశం... ఐ యామ్ సారీ అని ఉండటాన్ని బట్టి అతడు పాముతో కాట్లు వేయించుకుని చనిపోయి ఉంటాడని పోలీసులు నిర్థారించారు. కాగా మృతుడి తల్లి చెపుతూ... తన కుమారుడికి జంతువులంటే వల్లమాలిన ప్రేమ అనీ, అందువల్లనే అతడు పాము కాటుతో చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నట్లు చెప్పింది.