శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (14:51 IST)

ఆధార్ కార్డ్ మస్ట్ ఇన్ ఏపీ : లేకుంటే రేషన్ కార్డు కట్!

ఆధార్ కార్డు లేకుంటే రేషన్ కార్డులను కట్ చేస్తామని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. తద్వారా ఇక నుంచి ఇది తప్పనిసరి కానుంది. తెలుపురంగు రేషన్‌కార్డు, గ్యాస్ కనెక్షన్, చివరకు విద్యుత్ కనెక్షన్ వంటివి అన్నింటికీ ఆధార్ కార్డు ఉండి తీరాల్సింది. దీనిని ఇపుడు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
దీనిలోభాగంగా ఆధార్‌కార్డు లేకపోతే వచ్చేనెల నుంచి చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే కోటాను నిలిపివేస్తామని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 
 
విశాఖ జిల్లావ్యాప్తంగా 41 లక్షల మంది ఉండగా, ఇందులో 22 లక్షల మంది అంటే 67 శాతం మేర ఆదార్ కార్డులు తీసుకోగలిగారన్నారు.