Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కన్నీటి పర్యంతమైన వాంగ్ కీ: 54 ఏళ్ల తర్వాత చైనాలో తొలి అడుగు

హైదరాబాద్, ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (02:06 IST)

Widgets Magazine

దారి తప్పి చైనా సరిహద్దునుంచి భారత్ లోకి అడుగుపెట్టి ఇండియన్ ఆర్మీ చేతికి చిక్కిన ఆ చైనా సైనికుడు దాదాపు 54 ఏళ్ల తర్వాత మాతృభూమిపై అడుగు మోపిన దృశ్యం హాలీవుడ్ సినిమాల్లోని క్లైమాక్స్‌ను తలపించింది. ఎనిమిదేళ్లు భారత్‌లో నిర్బంధంలో ఉండి తర్వాత సొంత దేశం చైనా తిరస్కృతికి బలై అయిదు దశాబ్దాలుగా విధిలేని పరిస్థితుల్లో భారత్‌లోనే ఉండిపో యి భారతీయ స్త్రీని వివాహమాడి పిల్లలను కన్న ఆ చైనీయుడు చైనా పాస్‌పో్ర్ట్ లభించిన నాలుగేళ్ల తర్వాత శనివారం ఎట్టకేలకు చైనాలోని తన సొంత ఊరికి వెళ్లాడు.

54 ఏళ్ల తర్వాత తిరిగి వస్తుండటంతో వాంగ్‌ను చూడటానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిజియానన్‌ గ్రామస్తులంతా వరుసగా నిలబడి అతనికి స్వాగతం పలికారు. 54 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత తన అన్నను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వాంగ్‌కీ సోదరుడు వాంగ్ షన్ మీడియాకు చెప్పాడు. చైనాలోని గ్జియాన్ జియాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయటకు వస్తూ వాంగ్ తన సోదరులు, అక్కచెల్లెల్లకు దగ్గరకు తీసుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. 'చిట్టచివరికి నా సొంతగూటికి చేరుకున్నా..' అన్నాడు చెమ్మగిల్లినకళ్లతో..
 
భార్యాపిల్లలతో కలిసి శనివారం పుట్టినగడ్డకు చేరుకున్న అతడికి గ్రామస్తులు ఘనంగా స్వాగతించారు. ఆ చైనీస్‌ సైనికుడి పేరు వాంగ్‌ కీ. ఇన్నాళ్లు అతను గడిపింది ఎక్కడోకాదు.. మన ఇండియాలోనే! అది 1963నాటి ముచ్చట.. భారత్ - చైనా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో కాపలా కాస్తోన్న వాంగ్‌ కీ.. పొరపాటున భారత భూభాగంలోకి ప్రవేశించి గల్లంతయ్యాడు. దారితోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న అతణ్ని రెడ్‌ క్రాస్‌ సంస్థ గుర్తించింది. అనంతరం వాంగ్‌ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. వాంగ్‌ను చైనీస్‌ గూఢచారిగా అనుమానించిన ఇండియా అతనికి ఏడేళ్ల కారగారశిక్షను విధించింది. శిక్షపూర్తయిన తర్వాత చైనాకు వెళదామనుకున్న వాంగ్‌కు సొంతదేశం నుంచే విముఖత ఎదురైంది!
 
పలు కారణాల వల్ల వాంగ్‌ను తన దేశస్తుడిగా అంగీకరించడానికి చైనా ప్రభుత్వం విముఖత ప్రదర్శించింది. దీంతో అతను ఇక్కడే ఉండిపోయాడు. ఇక్కడి అమ్మాయినే పెళ్లిచేసుకున్నాడు. ఏళ్లు గడిచినా వాంగ్‌కు సొంతదేశం వెళ్లాలనే కోరిక తగ్గలేదు. చైనీస్‌ ప్రభుత్వానికి తరచూ మొరపెట్టుకుంటూనే ఉండేవాడు. షాంగ్జీ క్జియాంగ్జియాన్ కౌంటీలోని జూజియానన్ గ్రామంలోని నివసించే వాంగ్‌కీ కుటుంబ సభ్యులు సైతం అంగీకరించినా ప్రభుత్వం వినిపించుకోలేదు. అతను కూడా తన పోరాటాన్ని ఆపలేదు..
 
వాంగ్‌కీ విషయమై భారత-చైనా దౌత్యాధికారుల మధ్య ఏళ్లపాటు చర్చలు జరిగాయి. చివరికి 2013లో వాంగ్‌కు పాస్‌పోర్ట్‌ ఇచ్చేందుకు చైనీస్‌ ప్రభుత్వం అంగీకరించింది. పాస్‌పోర్టు లభించిన నాలుగేళ్ల తర్వాత, శనివారం అతను చైనాలోని సొంత ఊరికి వెళ్లాడు.  హాలీవుడ్‌ సినిమాకు ఏమాత్రం తీసిపోని రీతిలో.. పొరపాటున సరిహద్దులుదాటి పొరుగుదేశంలోకి ప్రవేశించిన ఓ సైనికుడు తిరిగి 54 ఏళ్ల తర్వాత సొంత దేశానికి చేరుకున్నాడు. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళకు మరో షాక్... పన్నీర్ సెల్వం గూటికి మరో ఎంపీ... పెరుగుతున్న వలసలు

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు మరో షాక్ తగిలింది. అన్నాడీఎంకేకు చెందిన ...

news

కొరకరాని కొయ్యలా పన్నీర్ సెల్వం... శశికళ చేసిన తప్పులు ఇవే... ఆశలు గల్లంతే

నిన్నటివరకు తనకు వంగివంగి నమస్కారాలు చేసిన ఓ.పన్నీర్ సెల్వం ఇపుడు కొరకరాని కొయ్యలా ...

news

పన్నీర్‌కు శరత్ కుమార్ మద్దతు.. ఆ వర్గంలో చేరితే తినే కూరల్లో ఉప్పు ఉందా? అని అడుగుతారు

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు రాజ్యసభ సభ్యుల మద్దతు కూడా పెరుగుతోంది. ఇప్పటికే ...

news

శశికళకు కంట్లో నలుసుగా మారిన పన్నీర్.. మిస్డ్ కాల్ సర్వేలో ''అన్న''దే పైచేయి..

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం కంట్లో ...

Widgets Magazine