శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (10:00 IST)

మీరు దూసుకెళ్లండి.. మీకే మా మద్దతు.. భారత్‌కు అమెరికా అండ

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపుదాడి చేసి పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టడంపై దేశీయంగానే కాకుండా, విదేశాల్లో సైతం మంచి స్పందన వస్తోంది.

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపుదాడి చేసి పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టడంపై దేశీయంగానే కాకుండా, విదేశాల్లో సైతం మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా నుంచి పూర్తి మద్దతు లభించింది. ఉగ్రవాదంపై పోరులో భారతకు మద్దతునిస్తామని, పాకిస్థాన్ ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని అరికట్టాలని అమెరికా హితవు పలికింది. 
 
భారత చేసిన దాడుల నేపథ్యంలో జాతీయ భద్రత సలహాదారు అజిత దోవల్‌కు ఫోన్‌ చేసిన అమెరికా భద్రత సలహాదారు సుసాన్‌ రైస్‌.. యురీలో ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రపోరులో భారతకు అండగా ఉంటామని ఆమె ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాదులు, సంస్థలపై పాకిస్థాన్‌ కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. ఉపఖండంలో శాంతి కోసం భారతతో కలసివస్తామని, ఉగ్రచర్యలను ఎదుర్కోవడంలో భారతకు బాసటగా నిలుస్తామని ప్రకటించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్‌ గట్టిగా నియంత్రించాలని సుసాన్‌ రైస్‌ తేల్చి చెప్పారు. 
 
అదేసమయంలో అణ్వస్త్రాలు కలిగిన భారత, పాక్‌ రెండు దేశాల్లో భారత్‌ది బాధ్యతాయుతమైన పాత్ర అని అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్‌ కార్టర్‌ అభివర్ణించారు. అణ్వస్త్రాలు కలిగి ఉన్నప్పటికీ భారత ఎప్పుడూ బాధ్యతారహితంగా వ్యవహరించలేదన్నారు. అదేసమయంలో పాక్‌ వైఖరి అందుకు భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు.