గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (18:33 IST)

నేపాల్ భూకంపం.. శిథిలాల వద్ద సెల్ఫీల కర్మేంట్రా బాబూ..!

సోషల్ మీడియా మోజుతో యువతలో విలువలు క్షీణించిపోతున్నాయి. అందుకిదే నిదర్శనం. నేపాల్‌ను భూకంపం కుదిపేసింది. ఈ భూకంపంలో చారిత్రక కట్టడాలు ధ్వంసమయ్యాయి. ఈ విలయం ధాటికి వేలాది మంది ప్రాణాలు విడిచారు. నేపాలీలది ఇప్పుడు నిజంగా దయనీయ పరిస్థితి! చారిత్రక కట్టడాల సందర్శనకు వెళ్లిన యాత్రికులు ఇప్పుడు ఆ శిథిలాల కింద విగతజీవులయ్యారు. 
 
ఓవైపు శిథిలాల కింద శవాల గుట్టలు పడి ఉండగా, ఆ శిథల కట్టడాల ముందు నిలబడి యువత సెల్ఫీలు తీసుకుంటోంది. ఖాట్మండూలోని ధరారా టవర్ కూడా ధ్వంసం కాగా, దాని ముందు నిలుచుని సెల్ఫీ తీసుకుంటున్న యువకుడి ఫొటో భారత మీడియాలో దర్శనమిచ్చింది. సాటి మనుషులకు సాయపడాల్సింది పోయి, సోషల్ మీడియా వ్యసనంతో ఇలా సెల్ఫీలు తీసుకుంటుండడాన్ని ఏమనాలి? ఇదేం పాడు సోషల్ మీడియా మోజోనని సర్వత్రా విమర్శలొస్తున్నాయి.