మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 24 జులై 2014 (18:06 IST)

నదిలో కూలిన అల్జీరియా ఫ్లైట్ - ప్రయాణికులు జలసమాధి?

అల్జీరియా దేశానికి చెందిన ఎయిర్ అల్జిర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానమొకటి నైజర్ అనే ప్రాంతంలో ఓ నదిలో జలసమాధి అయింది. ఈ ప్రమాదంలో 116 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో 110 మంది ప్రయాణికులు.. ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఇటీవలి కాలంలో విమానాలకు యమగండకాలం నడుస్తున్నట్టుగా వుంది. దీనికి నిదర్శనంగా వరుసపెట్టి విమాన దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా, అల్జీరియా దేశానికి చెందిన అల్జీర్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఏహెచ్ 5017 నెంబరు గల విమానం ఒకటి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యమైంది. ఒవగడౌగో నుంచి అల్జీర్స్ వెళ్తున్న ఈ విమానం నైజర్ ప్రాంతంలో ఓ నదిలో కుప్పకూలిపోయింది. 
 
ఈ విమానంలో 110 మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది వున్నారు. ఈ 116 మంది మరణించి జల సమాధి అయ్యారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల విమానాన్ని దారి మార్చుకోవాలని సూచించిన కాసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ఆ విమానంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రచండంగా వీస్తున్న గాలుల వల్లే ఈ విమానం కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. 
 
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఎంహెచ్-370 విమానం నాలుగు నెలల క్రితం అదృశ్యం కాగా, దాని ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులలో మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానాన్ని క్షిపణితో కూల్చివేసిన విషయం తెల్సిందే. దీంతో ఇందులో ఉన్న మొత్తం 295 మంది మరణించారు. ఈ ప్రమాదం నుంచి తేరుకోక ముందే తైవాన్‌కి చెందిన విమానం కుప్పకూలి 51 మంది మృత్యువాతపడిన విషయం తెల్సిందే. తాజాగా గురువారం నాడు అల్జీర్స్ విమానం 116 మందితో ప్రయాణిస్తూ కుప్పకూలింది.