శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (11:32 IST)

ఎయిర్ అల్జీరియా పౌర విమానం ఎక్కడ కూలిందో తెలుసా?

అల్జీరియా దేశంలోని ఎయిర్ అల్జీరియా సంస్థకు చెందిన ఒక పౌర విమానం గురువారంనాడు బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కు వస్తుండగా వాతావరణం అనుకూలించగా కూలిపోయింది. ఈ విమానంలో 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా, వీరంతా దుర్మరణం పాలయ్యారు. 
 
టేకాఫ్ అయిన పది నిమిషాలకే ఈ విమానం జాడ తెలియకుండా పోయింది. అయితే ఈ విమానం కూలిపోయిందని అధికారులు చెపుతున్నారు. అయితే ఎక్కడ కూలిందన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. తొలుత ఓ నదిలో కూలిపోయిందన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎడారిలో కూలిపోయిందని అన్నారు. 
 
తాజాగా మాలీ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయిందని అంటున్నారు. భారీగా వర్షం కురుస్తూ ఉండడం, ప్రచండ గాలులు వీస్తూ ఉండడం వల్ల ఈ విమానం కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఈ విమానంలో ఎక్కువ మంది ఫ్రెంచ్, స్పానిష్ జాతీయులే ఉన్నట్టు సమాచారం.