బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2015 (13:24 IST)

ఆప్ఘన్ ఆస్పత్రిపై అమెరికా బాంబులు.. 19 మంది మృతి : ఖండించిన ప్రపంచ దేశాలు

ఆప్ఘనిస్థాన్‌లోని నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఆస్పత్రిపై అమెరికా సేనలు వైమానికి దాడి చేశాయి. ఈ దాడిలో పలువురు వైద్యులు, రోగులతో సహా మొత్తం 19 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఈ చర్యను ఐక్యరాజ్య సమితో పాటు.. అనేక ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. 
 
ఆప్ఘనిస్థాన్‌లోని కుందుజ్ ప్రాంతంలో ఈ దాడి జరుగగా, ఈ దాడిని దురదృష్టకరమైన ఘటనగా అమెరికా సైన్యం అభివర్ణిస్తూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తాము ప్రజలకు ముప్పుగా మారిన వారిని లక్ష్యంగా చేసుకుని మాత్రమే దాడులు జరిపామని, అయితే, సమీపంలోనే ఉన్న ఆసుపత్రిపై బాంబులు పడ్డాయని అందులో పేర్కొంది. అలాగే, ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్టు ప్రకటించారు. 
 
ఇదిలావుండగా, తప్పెక్కడ జరిగిందన్న విషయమై పూర్తి విచారణను పారదర్శకంగా జరపాలని ఐక్యరాజ్యసమితి డిమాండ్ చేసింది. పౌరుల ప్రాణాలను తీసే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించిన యూఎస్ అధ్యక్షుడు బాన్ కీ మూన్, యూఎస్ పై ఆఫ్గన్ ప్రజల నమ్మకాన్ని చెరుపుకోరాదని సూచించారు.