శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 జులై 2014 (11:00 IST)

మాలి ప్రాంతంలో అల్జీరియా విమాన శకలాల గుర్తింపు!

అల్జీరియాకు చెందిన ఒక పౌరవిమానమొకటి గురువారం బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కు వస్తుండగా కుప్పకూలిపోయిన విమాన శకలాలను మాలి ప్రాంతంలో కనుగొన్నారు. ఈ విమానంలో 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో సహా మొత్తం 116 మంది మృత్యువాతపడ్డారు. ఈ విమానం సహారా ఎడారి ప్రాంతంలో కూలి వుండొచ్చని భావిస్తున్నారు. ఈ విమానం కూలిన ప్రాంతంలో ప్రయాణికుల శరీర భాగాలతో పాటు... విమాన శకలాలను కనుగొన్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. 
 
ఈ విమానంలో 51 మంది ఫ్రెంచ్ జాతీయులు, 27 మంది బుర్కినా పాసో పౌరులు, 8 మంది లెబనీసె, ఆరుగురు అల్జీరియన్లు, ఐదుగురు కెనడా పౌరులు, నలుగురు జర్మన్లు, ఇద్దరు లక్సెంబర్గ్‌లు, స్విస్, బెల్జియన్, ఈజిప్టు, ఉక్రెయిన్, నైజీరియన్, కామెరూనియన్, మాలిల దేశాలకు చెందిన ఒక్కో పౌరుడు ఉన్నట్టు ఆ దేశ అధికారులు వెల్లడించారు. కాగా, కుప్పకూలిపోయిన విమానం గత పదకొండు సంవత్సరాలుగా ఈ విమానం పనిచేస్తూనే వుంది. చాలా పాతబడిపోయిన ఈ విమానం వాతవరణంలోని పీడనాన్ని తట్టుకోలేక కూలిపోయి వుండొచ్చని తెలుస్తోంది.