గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (14:05 IST)

అమెరికా ఫ్రీజ్: గజ గజ వణికిపోతున్న ప్రజలు!

అమెరికాను చలి పులి భయపిస్తోంది. అమెరికా పూర్తిగా ఫ్రీజ్ కావడంతో ప్రజలు చలితో గజ గజ వణికిపోతున్నారు. వివిధ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో విపరీతమైన చలి, మంచుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మంచు ప్రమాదాన్ని ఆ దేశ ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించనుంది.
 
న్యూయార్క్ పశ్చిమ ప్రాంతంలోని ఎరీ కౌంటీలో 60 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. న్యూయార్క్ గవర్నర్ 10 కౌంటీలలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మంచు గాలులకు పశ్చిమ న్యూయార్క్ ప్రాంతంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
మంచు ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో సున్నా డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం 1976 తర్వాత ఇదే తొలిసారి. అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది.