Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్యాషియర్‌‌కు తుపాకీ గురిపెట్టాడు.. వీడియో

శుక్రవారం, 8 డిశెంబరు 2017 (14:23 IST)

Widgets Magazine

తుపాకీలు చూపెట్టి నేరాలకు పాల్పడే దుండగుల సంఖ్య పెరిగిపోతుంది. అయితే చోరీకి వచ్చిన ఓ దొంగకు వింత అనుభవం ఎదురైంది. అమెరికాలోని ఫ్లోరిడాలో గన్ పెట్టి ఓ షాపులోని క్యాషియర్‌ను బెదిరించిన దొంగకు మైండ్ బ్లాక్ అయ్యింది. క్యాషియర్‌కు తుపాకీ గురిపెట్టినా డబ్బులివ్వకపోవడంతో పాటు దొంగ ముఖాన్నే అలానే చూస్తూ నిల్చుండిపోవడంతో విసుగెత్తిన దొంగ అక్కడ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే... ఫ్లోరిడాలోని ఓ దుకాణంలోకి ఓ వ్యక్తి వచ్చాడు. కొన్ని చాక్లెట్లు, ఐస్‌క్రీంలు తీసుకుని క్యాషియర్‌ దగ్గరకు వెళ్లాడు. క్యాషియర్‌ ఆ వస్తువులకు బిల్‌ చేస్తుండగా దొంగ తన జేబు నుంచి తుపాకీ తీసి.. గురిపెట్టాడు. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరైనా భయపడటం, అరవడం చేస్తుంటారు. లేకుంటే దొంగ అడిగిన మొత్తాన్ని ఇచ్చేస్తుంటారు. కానీ ఈ క్యాషియర్ మాత్రం ధైర్యంగా నిలిచాడు. 
 
ఆ వ్యక్తి తీసుకున్న వస్తువుల్ని కవర్లో పెట్టి అతడికి ఇచ్చేయడం చేశాడు. కామ్‌గా ఏమీ చేయకుండా క్యాషియర్ నిలిచిపోయాడు. దాదాపు 15 సెకన్లపాటు అక్కడే నిల్చున్న దొంగ.. ఇక లాభం లేదనుకుని తన వస్తువులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను స్థానిక పోలీసులు యూట్యూబ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్ పైన పవన్ పంచ్.... పవన్‌కు నారా లోకేష్ ఝలక్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్ని సమస్యల గురించి ప్రస్తావించినా పెద్దగా చర్చకు రాలేదు కానీ ...

news

రాజస్థాన్ 'లవ్ జిహాద్' వీడియో

రాజస్థాన్ రాష్ట్రంలో లవ్ జీహాద్ పేరుతో ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన వ్యవహారం ...

news

ఢిల్లీ లిక్కర్ మాఫియా దాష్టీకం : మహిళ నగ్న ఊరేగింపు

ఢిల్లీలో లిక్కర్ మాఫియా చెలరేగిపోయింది. తమ గురించి ఢిల్లీ మహిళా కమిషన్‌కు సమాచారం ...

news

చంద్రబాబుది తల్లి టీడీపీ-జనసేన పిల్ల టీడీపీ: రోజా

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ విమర్శలు ...

Widgets Magazine