శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (16:02 IST)

పిజ్జా అడిగినందుకు రోగిని ఆస్పత్రి నుంచి గెంటేసిన వైనం.... ఎక్కడ?

అమెరికాలో ఓ సంఘటన జరిగింది. స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు ఆస్పత్రిలో చేరిన ఓ రోగి.. తినేందుకు పిజ్జా కావాలని అడిగినందుకు ఆస్పత్రి నుంచి గెంటేశారు. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
అమెరికాకు చెందిన స్టీవెన్‌ అనే 33 యేళ్ళ వ్యక్తి బరువు 800 పౌండ్లు. అంటే సుమారు 300 కిలోలు. ఈ భారీ శరీరాన్ని మోయలేక బరువు తగ్గించుకుందామని రోడ్‌ ఐలాండ్‌ ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యుల సూచనలు పాటిస్తూ నిదానంగా బరువు తగ్గుతున్నాడు. అలాంటి సమయంలో జిహ్వను చంపుకోలేక వైద్యుల కళ్లుకప్పి పిజ్జా ఆర్డరిచ్చి తెప్పించుకున్నాడు. దీన్ని చూసిన ఆస్పత్రి సిబ్బందికి చిర్రెత్తుకొచ్చింది. అంతే అతన్ని ఆస్పత్రి నుంచి నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపించివేశారు. 
 
బరువు తగ్గేందుకు ఆస్పత్రిలో చేరిన స్టీవెన్... ఓ వ్యసనంలా మారిన ఆహారపు అలవాట్లు మానుకోలేక పోతున్నాడని, అతను చేస్తున్న పనులకు ఆస్పత్రి నుంచి బయటకు పంపించడం మినహా మరోమార్గం లేదని ఆస్పత్రి సిబ్బంది వివరణ ఇస్తున్నారు. కాగా, స్టీవెన్ చేసే పనులకు చివరకు తండ్రికి కూడా విసుగొచ్చి ఆస్పత్రిలోనే వదలి వెళ్లిపోయాడు.