శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (17:18 IST)

అతిథికి అరుదైన బహుమతులు.. ఒబామాకు అందించిన మోడీ..!

భారతదేశ పర్యాటకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన మంగళవారంతో ముగిసింది. పర్యటనను ముగించుకుని వెళుతున్న ఒబామాకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అరుదైన బహుమతులను అందించారు. ఈ విషయాన్ని మోడీ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. 
 
1957లో భారత పర్యటనకు వచ్చిన అమెరికన్ సింగర్ మరియన్ ఆండర్సన్ ఇక్కడ పాడిన గీతాల రికార్డులను, ఆ సమయంలో ఆకాశవాణిలో ప్రసారం అయిన ఆండర్సన్ ఇంటర్వ్యూ, గాంధీ స్మారకార్థం ఆయన పాడిన 'లీడ్ కిండ్లీ లైట్' గీతం రికార్డుల ఒబామాకు మోడీ బహుమతిగా ఇచ్చినట్టు తెలిపారు.
 
అదేవిధంగా అమెరికా నుంచి తొలిసారి ఇండియాకు వచ్చిన టెలిగ్రామ్ ఒరిజినల్ కాపీ ఆయనకు అందించినట్టు మోడీ  పేర్కొన్నారు. వీటితో పాటు 1950 జనవరి 26న విడుదలైన స్టాంప్, దేశ సాంప్రదాయాన్ని గుర్తు చేసే విధమైన విలువైన చీరలు, పెయింటింగ్‌లు వంటి పలు అరుదైన బహుమతులను ఒబామాకు మోడీ బహూకరించినట్టు తెలిపారు.