శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 జులై 2015 (12:22 IST)

అమెరికాలో పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతి.. ఈ యేడాదిలో 200సార్లు కాల్పులు

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి నానాటికీ పెరిగిపోతోంది. ఇందుకు నిదర్శనమే ఈ యేడాది ఇప్పటివరకు ఏకంగా 200సార్లు కాల్పులు జరిగాయి. ఇందులో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వీటిలో ఏప్రిల్‌లో 18, మే నెలలో 39, జూన్‌లో 41, జూలైలో ఇప్పటి వరకు 34 ఘటనలు జరిగినట్టు వాషింగ్టన్ పోస్టు పత్రిక వెల్లడించింది.
 
తాజాగా లూసియానలోని సినిమా థియేటర్‌లో కాల్పులు జరుగగా నిందితుడితోపాటు ముగ్గురు మృతిచెందినట్లు తెలిపింది. లూసియాన థియేటర్‌లో కాల్పులు జరగడం ఈ ఏడాదిలో ఇది ఎనిమిదోసారి. వోహియోలో పది, కాలిఫోర్నియాలో 14, న్యూయార్క్‌లో 16సార్లు కాల్పులు జరిగినట్లు ఆ పత్రిక వెల్లడించింది. లూసియాన థియేటర్ కాల్పులతో మొత్తం ఘటనల సంఖ్యకు 204కు చేరిందని తెలిపింది.