గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 మే 2016 (17:40 IST)

పెంపుడు జంతువుల కోసం ఎయిర్‌పోర్టులో వాష్ రూమ్.. ఎక్కడ?!

పెంపుడు జంతువులతో ప్రయాణం చేసే అమెరికన్లకో శుభవార్త. కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను వెంటపెట్టుకుని ప్రయాణించే వారి సంఖ్య పెరిగిపోతున్న కారణంతో జాన్ ఎఫ్. కెన్నడీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో వాష్ రూమ్ ఏర్పాటు చేశారు. న్యూయార్క్ నగరంలో ఉన్న ఈ విమానాశ్రయం ప్రపంచంలో ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటి కావడంతో పెట్స్ కోసం ప్రత్యేక వాష్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
 
విమానాశ్రయానికి పెంపుడు జంతువుల్ని తీసుకొచ్చేవారికి ఈ వాష్ రూమ్‌ ఉపయోగపడుతుందని, బాత్రూమ్ డోర్ గ్లాస్‌‌పై కుక్క పాద ముద్రను ముద్రించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. పెట్ రిలీఫ్ ఏరియా పేరిట 70 చదరపు అడుగులతో దీనిని నిర్మించినట్లు టెర్మినల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుశానా కున్హా వెల్లడించారు.