శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2015 (18:17 IST)

భారత్-పాక్ చర్చల రద్దుపై షరీఫ్: కాశ్మీర్ నాయకులు థర్డ్ పార్టీ కాదు కదా?

భారత్-పాకిస్థాన్ చర్చలు రద్దు కావడంపై ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు. కాశ్మీర్ వేర్పాటువాద నేతలతో పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు సమావేశం ఇటీవల రద్దు కావడంపై షరీఫ్ మండిపడ్డారు. 
 
ఇస్లామాబాద్‌లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ భేటీలో షరీఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్, భారత్ తప్ప కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మూడో వ్యక్తి లేదా మూడో కూటమికి తావులేదని భారత్ అంటోందని ప్రస్తావించారు. 
 
అయితే కాశ్మీర్ నాయకులు థర్డ్ పార్టీ కాదు కదా? కాశ్మీర్ నేతలతో మాట్లాడితే తప్పేముందని ప్రశ్నించారు. నిజానికి వారే ప్రధాన పార్టీ అని, అలాంటివారితో చర్చిస్తామని తాము అన్నందుకు భారత్ తమతో చర్చల్ని రద్దు చేసుకుందని షరీఫ్ పేర్కొన్నారు.
 
కాగా జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి సమావేశాన్ని పాకిస్థాన్ రద్దు చేసిన నేపథ్యంలో.. ఆ సమావేశానికి పొడిగింపుగా కాశ్మీర్ వేర్పాటువాద నాయకులతో భేటీ అజెండాను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడంపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.