బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 29 జూన్ 2015 (22:10 IST)

‘అర్జున్’ నిజంగా భారత్‌కు వరం... చైనా ప్రశంస

భారత్‌కు చెందిన సైనిక ఆయుధాలపై ఎప్పుడూ వ్యంగ్యాస్త్రాలను సంధించే చైనా రూటు మార్చింది. అర్జున్ నిజంగా భారత దేశ రక్షణ రంగ వ్యవస్థకు వరంలాంటిదేనని ఆ దేశ సైనికాధికారులు మనసులో మాటను చెప్పారు. పొగడ్తలతో ముంచెత్తారు. వివరాలిలా ఉన్నాయి. 
 
చైనా, భారత్‌ల మధ్య సైనిక సంబంధాల పురోభివృద్ధి నేపథ్యంలో రెండు దేశాలు స్నేహహస్తాన్ని అందించుకోవాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో భారత మీడియా బృందాన్ని అక్కడి అకాడమీ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్సెస్ ఇంజినీరింగ్ సైనిక సంస్థను సందర్శించేందుకు అనుమతించింది.  ఈ సందర్భంగా భారత మీడియా ప్రతినిధులతో సీనియర్ కల్నల్ లియో డెగాంగ్ మాట్లాడుతూ, 'అర్జున్' మెరుగైన యుద్ధ ట్యాంకు అని పేర్కొన్నారు. భారత స్థితిగతులకు అతికినట్టు సరిపోయే ట్యాంకు అని కితాబిచ్చారు.