శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (15:20 IST)

మార్స్‌ను దాటేసిన సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క : మంగళ్‌యాన్ సేఫ్!

అంతరిక్షంలోకి భారత్ పంపిన మాస్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఇక సురక్షితంగా తన విధులను నిర్వహించనుంది. ఖగోళ శాస్త్రవేత్తలను ఉత్కంఠకు గురిచేస్తూ ఆదివారం మధ్యాహ్నం సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క అంగారకుడిని సురక్షితంగా దాటిపోయింది. సౌరకుటుంబం వెలుపల నుంచి వచ్చిన ఈ తోకచుక్క సెకనుకు 56 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలకు అరుణగ్రహానికి 1,39,500 కిలోమీటర్ల సమీపం నుంచి దూసుకుపోయింది.
 
అంగారకుడి చుట్టూ తిరుగుతున్న మామ్, అమెరికాకు చెందిన మూడు ఉపగ్రహాలు, ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన మరో ఉపగ్రహానికి ఈ తోకచుక్క నుంచి ప్రమాదం ఏర్పడవచ్చని ఖగోళ శాస్త్రవేత్తుల భావించారు. దీంతో శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సైడింగ్ స్ప్రింగ్ నుంచి ధూళికణాలు మార్స్‌ వైపు వచ్చే సమయానికి ఉపగ్రహాలన్నీ మార్స్ వెనక వైపు ఉండేలా శాస్త్రవేత్తలు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో తోకచుక్కను ఫొటోలు తీయడంతో పాటు ఉపగ్రహాలన్నీ అనుకున్న సమయానికి మార్స్ వెనకకు చేరడంతో సురక్షితంగా ఉన్నాయని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అధికారికంగా ప్రకటించింది.