మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 31 ఆగస్టు 2014 (13:02 IST)

నవాజ్ షరీఫ్‌పై హత్యయత్న కేసు పెడతాం : ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌పై హత్యాయత్న కేసును పెట్టనున్నట్టు తెహ్రీక్ ఇన్సాఫ్ ఇ పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడైన నవాజ్ షరీఫ్ పై హత్యాతయ్నం కేసు పెట్టనున్నట్టు తెలిపారు. అమాయ ప్రజలపై పోలీసుల చర్యను ఆయన ఖండించారు. నవాజ్ షరీఫ్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. 
 
గత ఎన్నికల్లో రిగ్గింగ్ వంటి అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వచ్చిన నవాజ్ షరీఫ్.. తక్షణం తన పదవికి రాజీనామా చేయాలంటూ ఇమ్రాన్‌తోపాటు పాక్ ఖాద్రి మద్దతుదారులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా శనివారం రాత్రి ఆందోళనకారులు నవాజ్ షరీఫ్ ఇంటి ముట్టడికి యత్నించడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీచార్జ్, కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో నిరసనలో పాల్గొంటున్న ఏడుగురు మృత్యువాత పడగా, మరో 300 మంది వరకు గాయపడ్డారు. దీనిపై ఇమ్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.