మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 4 జులై 2015 (14:49 IST)

అక్లాండ్ హీరో హర్మాన్ సింగ్‌కు న్యూజిలాండ్ సర్కారు ఘన సన్మానం

తన మత సంప్రదాయాలకు విరుద్ధమని తెలిసినా తలపాగా తీసి ఆపదలో ఉన్న యువకుడిని ఆదుకున్న హర్మాన్‌ సింగ్‌కు న్యూజిలాండ్ ప్రభుత్వం ఓ అవార్డు ఇచ్చింది. డిస్ట్రిక్ట్ కమాండర్స్ సర్టిఫికేట్ పేరుతో ఈ అవార్డును ప్రదానంచేసింది. న్యూజిలాండ్‌లో ఓ రోడ్డుపై రక్తం కారుతున్న ఓ బాలుడి తలకు కట్టుకట్టేందుకు తలపాగాను తీశాడు.
 
నిజానికి ఓ సిక్కుమతస్థుడు తలపాగా తీయకూడదు. కానీ, మానవతా కోణంలో స్పందించి తన తలపాగా తీసి కట్టుకట్టినందుకు సిక్కు మతగురువులే ఆ యువకుడిని ప్రశంసించారు. ఇదే యువకుడికి న్యూజిలాండ్ ప్రభుత్వం ఓ అవార్డిచ్చి సత్కరించింది. 'డిస్ట్రిక్ట్ కమాండర్స్ సర్టిఫికెట్' పేరుతో ఇచ్చిన ఈ అవార్డును మనకావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో హర్మాన్ అందుకున్నాడు. ఇదొక న్యూజింలాండ్ పోలీసు అవార్డు. 
 
గత మే 15న డీజన్ అనే బాలుడు పాఠశాలకు వెళుతుండగా, ఓ కారు ఢీకొట్టింది. దీంతో అతని తల నుంచి రక్తం కారుతుండడంతో, హర్మాన్ తన తలపాగా తీసి కట్టుకట్టి ప్రాథమిక చికిత్స చేశాడు. ఈ దృశ్యాలు సామాజికమాధ్యమాల్లో తెగ చక్కర్లు కొట్టిన విషయం తెల్సిందే. ఈ యువకుడిని అక్లాండ్ హీరోగా న్యూజిలాండ్ వాసులు పిలుస్తున్నారు.