మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2016 (16:53 IST)

ఆస్ట్రేలియాలో చదువు: ఇంగ్లీష్ రాకపోతే.. కాల్ గర్ల్స్‌గా మారిపోవాల్సిందేనట!

చదువుకోవాలని విదేశాలకు వెళ్ళే అమ్మాయిల జీవితం దుర్భరం అవుతోంది. ఆస్ట్రేలియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ వెల్లడించిన గణాంకాల ప్రకారం చదువు కోసం ఆసీస్‌కు వలస వెళ్తున్న విదేశీ విద్యార్థుల్లో సగం మంది వ్యభిచారం చేస్తూ జీవనం సాగిస్తున్నారనే షాక్ న్యూస్‌ను వెల్లడించింది. హై కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, భారీ ఫీజుల వల్లే ఎక్కువ మంది ప్రాస్టిట్యూట్స్‌గా మారుతున్నారని ఆ గణాంకాల ద్వారా తెలుస్తోంది. 
 
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో వ్యభిచారం చట్ట సమ్మతం. ఈ పరిసర ప్రాంత యూనివర్సిటీలో చదువుతున్న విదేశీ అమ్మాయిలో 43 శాతం మంది వేశ్యలుగా మారుతున్నారట. అయితే వీరంతా మసాజ్‌ పార్లర్స్‌లోనే జాయిన్‌ అవుతున్నారని.. కానీ వ్యభిచార కూపంలోకి దిగేందుకు మాత్రం అంగీకరించట్లేదని తెలిసింది. ఇంగ్లీష్ భాష బాగా వచ్చిన వారు ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్ చేసుకుని బతికిపోగా, ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్ చేయలేని వారు మాత్రం కాల్ గాళ్స్‌గానే మారుతున్నారని ఆ రిపోర్ట్ వెల్లడించింది. విదేశీ యువతులతో శృంగారానికి అక్కడ మంచి గిరాకి ఉందట.