Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శిశువును ప్లాస్టిక్ పేపర్లో చుట్టి కొరియర్ చేసింది: పార్శిల్ కదిలింది.. ఏడుపు శబ్ధం వినిపించడంతో?

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (12:34 IST)

Widgets Magazine

ముక్కుపచ్చరాలని శిశువును ఓ ప్లాస్టిక్ పేపర్లో చుట్టి పార్సెల్ చేసి ఓ మహిళ కొరియర్ ద్వారా ఓ అనాధ ఆశ్రమానికి పంపించిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఏమాత్రం కనికరం లేకుండా శిశువు కొరియర్లో అనాధాశ్రామానికి పంపడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చైనాలోని దాదా అనే ప్రాంతంలో ఓ కొరియర్ సంస్థకు ఓ పార్శిల్ వచ్చింది. అందులో ఓ అనాధ ఆశ్రమానికి సంబంధించిన చిరునామా వుంది. 
 
ఆ పార్శిల్‌ను ఇచ్చేందుకు కొరియర్ బాయ్ వెళ్తున్న సమయంలో ఆ పార్శిల్ నుంచి కదలికలు మొదలయ్యాయి. శిశువు ఏడ్చే శబ్ధం వినిపించింది. వెంటనే కొరియర్ బాయ్ ఆ పార్శిల్‌ను తెరచి చూశాడు. అందులో ముక్కుపచ్చలారని శిశువు వుండటం చూసి షాక్ అయ్యాడు. ఆపై స్థానికుల సహకారంతో పోలీసులకు కొరియర్ బాయ్ సమాచారం ఇచ్చాడు.
 
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శిశువును పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత ఆ శిశువు కన్నతల్లిని పోలీసులు కనుగొన్నారు. ఆమె పేరు లువోనని తెలిసింది. ఆమెను శిశువును వచ్చి తీసుకెళ్లాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా చైనాలో శిశువు వధించే వారికి ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇంట్లో కూర్చోబెట్టాల్సింది అమ్మాయిలను కాదు... అబ్బాయిలను : బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్

హర్యానా రాష్ట్రంలో ఓ ఐఏఎస్ కుమార్తెను హర్యానా రాష్ట్ర బీజేపీ చీఫ్ సుభాష్‌ బరాలా కుమారుడు ...

news

పెళ్ళికంటూ బయల్దేరి జైలు డాబాపై దిగిన హెలికాఫ్టర్.. పరుగులు తీసిన సిబ్బంది..

పెళ్ళి వేడుక కోసం హెలికాప్టర్‌లో బయల్దేరిన ఓ కుటుంబం.. నేరుగా కళ్యాణ మండపానికి వెళ్లకుండా ...

news

అత్త నాకిచ్చింది.. నన్నెవరూ పీకలేరు... టీటీవీ దినకరన్

తమిళనాడు రాజకీయాలు చూస్తుంటే టామ్ అండ్ జెర్రీ కథ గుర్తుకు వస్తుంది. టామ్ అండ్ జెర్రీలకు ...

news

నిన్నటివరకు న్యాయవాది.. నేడు న్యాయమూర్తి.. వెంకయ్య తెలుగు స్పీచ్ ఓ ఎక్స్‌ప్రెస్ : మోడీ

రాజ్యసభలో నిన్నటివరకు వివిధ సమస్యలపై ఓ న్యాయవాదిగా వాదించి, వాదాడిన వెంకయ్య నాయుడు ఇపుడు ...

Widgets Magazine