శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 11 ఫిబ్రవరి 2017 (07:54 IST)

కేన్సర్ కణితికి ట్రంప్ పేరు: రెండూ పనికిమాలినవే అంటున్న ఆ అమ్మాయి

చివరకు ట్రంప్ బతుకు బస్టాండు పాలవడం కాదు.. కేన్సర్ కణితి పాలబడింది. 24 ఏళ్ల అమెరికన్ పౌరురాలు ఎలీస్ స్టేపుల్టన్‌కు దురదృష్టవశాత్తూ కేన్సర్ వస్తే ఆ కణితికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టుకుని తన కసి అంతా తీర్చుకుంది. పైగా తనలో పెరిగిన కేన్సర్ కణితి, అమెర

చివరకు ట్రంప్ బతుకు బస్టాండు పాలవడం కాదు.. కేన్సర్ కణితి పాలబడింది. 24 ఏళ్ల అమెరికన్ పౌరురాలు ఎలీస్ స్టేపుల్టన్‌కు దురదృష్టవశాత్తూ కేన్సర్ వస్తే  ఆ కణితికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టుకుని తన కసి అంతా తీర్చుకుంది. పైగా తనలో పెరిగిన కేన్సర్ కణితి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు పనికిమాలినవే అంటూ తీసిపడేందా అమ్మాయి. ఇంకేం సోషల్ మీడియాలో ఈ ట్రంపు, కణితి వ్యవహారం వైరల్ అయిపోయింది. అమెరికన్ పౌరులు, నెటజన్లు అయితే నవ్వులే నవ్వులు. 
 
అసలు విషయం ఏమిటంటే.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బయటి దేశాలతో ఆడుకుంటుంటే, దేశం లోపలి ప్రజలు తమ దేశాధ్యక్షుడితో ఆడుకుంటున్నారు! ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆయనపై తమ ఆగ్రహాన్ని, అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. ఎలీస్‌ స్టేపుల్టన్‌ అనే అమెరికా పౌరురాలి వయసు 24 సం. కొంతకాలం క్రితం చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే, హాడ్జ్‌కిన్‌ లొఫోమా అనే క్యాన్సర్‌ కణితి బయటపడింది. ఆ కణితిని తగ్గించడానికి వైద్యులు ఆమెకు తీవ్రస్థాయిలో కీమోథెరపీ ఇచ్చారు.
 
కేమోథెరపీ ప్రభావంతో అందమైన ఆ అమ్మాయి జుట్టంతా రాలిపోయింది. కానీ ఎలీస్‌ బాధపడడం లేదు. పైగా చిరునవ్వులు చిందిస్తోంది. ఆ నవ్వులు ఎందుకంటే ఆమె తన కణితికి డొనాల్డ్‌ ట్రంప్‌ అని పేరు పెట్టుకుంది! ‘ట్రంప్‌ లాగే ఈ కణతి కూడా అసహ్యమైనది, పనికిమాలింది. మనిషిని యాతన పెడుతుంది’ అని ఈ అమ్మాయి అంటోంది. బాధలో కూడా నవ్వు పుట్టిస్తున్న ట్రంప్‌ మహాశయుడికి ప్రపంచ పౌరులంతా ధన్యవాద సమర్పణ చేయాల్సిందే.
 
అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడైనా ఇంత పనికిమాలిన బిరుదు సంపాదించుకుని ఉంటాడా. పైగా కేన్సర్ కణితిలాగా యాతన పెడతాడని ముక్తాయింపు కూడా సంపాదించుకున్నాడు.