శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 నవంబరు 2015 (16:26 IST)

భార్యపై అనుమానం.. గుండు గీసి.. సిగరెట్ వాతలు పెట్టిన భర్త.. ఎక్కడ?

భార్యాభర్తల మధ్య నమ్మకం అత్యంతబలమైంది. ఒకరిపై ఒకరికి ఏమాత్రం అనుమానం వచ్చినా ఆ సంసారం ఇక కోలుకోవడం కష్టం. పైగా.. ఒకరిని ఒకరు వేధించుకుంటుంటారు. అలా చివరికి వారు విడిపోవడమో లేక ఏదో ఒక అఘాయిత్యానికి పాల్పడటమో జరుగుతుంది. ఇంకొందరైతే మరీ శాడిస్టులుగా బిహేవ్ చేస్తుంటారు. ఇలాంటి వారి ప్రవర్తన కూడా వింతగానే ఉంటుంది. బహ్రెయిన్‌లో జరిగిన ఈ సంఘటను పరిశీలిస్తే... 
 
బెహ్రెయిన్‌లో నివశించే భార్యాభర్తలు కొంతకాలంపాటు ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని గడిపారు. ఈ క్రమంలో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. దీంతో వారిద్దరి ప్రతి రోజూ గొడవ జరుగుతుండేది. ఈ కోవలోనే రెండు రోజుల క్రితం ఘర్షణపడ్డారు. భర్త ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే భార్య తలను గొరిగేశాడు. కాలుతున్న సిగరెట్‌తో ఒళ్లంతా వాతలు పెట్టాడు.
 
ఈ టార్చర్ భరించలేక భార్య పోలీసులను ఆశ్రయించి. భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో భర్తను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం వచ్చినప్పటి నుంచి తనకు పిచ్చిపట్టినట్లయిందని అందుకే అలా చేసినట్టు కోర్టుకు చెప్పాడు. కేసును విచారించిన కోర్టు.. భర్తను దోషిగా నిర్ధారించింది. శిక్షను ఖరారు చేయాల్సి వుంది.