బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (05:44 IST)

ఏనాటికైనా అమెరికా అధ్యక్షుడిగా ఓ హిందువు : బరాక్ ఒబామా

అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా శ్వేతభవనం అధ్యక్షుడిగా ఎన్నిటికైనా ఒక హిందువు అవుతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకోసం అందరికీ సమాన అవకాశాల విధానాన

అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా శ్వేతభవనం అధ్యక్షుడిగా ఎన్నిటికైనా ఒక హిందువు అవుతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకోసం అందరికీ సమాన అవకాశాల విధానాన్ని కొనసాగించాల్సి ఉంటుందన్నారు. 
 
ఆయన అధ్యక్షుడిగా చివరి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. సమాన అవకాశాలు పాటిస్తే ఏనాటికైనా అమెరికాకు ఒక హిందువు అధ్యక్షుడు అవుతాడని చెప్పారు. అమెరికాలో జాతి వైవిధ్యాన్ని కాపాడితే ఒక మహిళ, ఒక హిందువు, ఒక యూదు, ఒక లాటినో అధ్యక్షులు తప్పకుండా అధ్యక్షులవుతారని చెప్పారు. 
 
2008లో ఎన్నికైనపుడు ఒబామా తొలి నల్లజాతి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. భవిష్యత్తులో జాతులతో సంబంధం లేకుండా ప్రతిభావంతులే ఉన్నత స్థానాల్లోకి వస్తారని ఒబామా విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థలో ప్రతీ ఒక్కరికీ పాత్ర కల్పించాలని పిలుపునిచ్చారు. తమను జాతి మరచిపోయిందని భావించిన వాళ్లే ట్రంప్‌కు ఓటేసి గెలిపించారని, ఇప్పుడు వారిని ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి తీసుకొచ్చే బాధ్యత ట్రంప్‌దేనని గుర్తు చేశారు.