శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (12:51 IST)

#ObamaAndKids... ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తానంటే వద్దనను కానీ.. తండ్రిగా దిగులు చెందుతా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా పిల్లలంటే విపరీతమైన ప్రేమ. చిన్న పిల్లలు కనబడితే కొద్దిసేపు వారితో గడపకుండా ఉండరు. గత ఎనిమిదేళ్ళుగా అమెరికా అధ్యక్షుడి హోదాలో దేశంలోగానీ, విదేశాలకు వెళ్ళినాగానీ ఆ

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా పిల్లలంటే విపరీతమైన ప్రేమ. చిన్న పిల్లలు కనబడితే కొద్దిసేపు వారితో గడపకుండా ఉండరు. గత ఎనిమిదేళ్ళుగా అమెరికా అధ్యక్షుడి హోదాలో దేశంలోగానీ, విదేశాలకు వెళ్ళినాగానీ ఆయన పిల్లలతో ఆడుకున్నప్పుడు, ముద్దాడినప్పుడు తీసిన ఫోటోలతో అమెరికా ఔత్సాహిక పారిశ్రామికవేత్త మైఖేల్ స్కోల్నిక్ ట్విట్టర్‌లో #ObamaAndKids పేరుతో ఒక హ్యాష్‌ట్యాగ్ సృష్టించిన విషయం తెలిసిందే. 
 
కాగా ఇటీవల బరాక్ ఒబామాను సీఎన్ఎస్ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడిగారు. ''మీ ఇద్దరు కూతుళ్లు ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తానంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు?'' అని ఆర్మీ మాజీ అధికారి ఒకరు ఈ ప్రశ్నఅడుగగా.. ఒబామా ఈ విధంగా సమాధానమిచ్చారు... ''తన ఇద్దరు కూతుళ్లు ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తానంటే అందుకు తాను అడ్డు చెప్పనని, అయితే వారి గురించి మాత్రం తండ్రిగా దిగులు చెందుతానంటూ కూతుళ్లపై ఒబామా తండ్రి ప్రేమను తెలియజేశారు. 
 
అనంతరం ఫోర్ట్ లీ మిలిటరీ బేస్ క్యాంపులో ఒబామా మాట్లాడుతూ.. దేశ భక్తి, క్రమశిక్షణ విషయంలో ఆర్మీ తనను ఏవిధంగా ప్రభావితం చేసిందో వివరించారు. మీ పిల్లలు, ఎప్పటికీ మీ పిల్లలే వారిని బంధించడానికి ప్రయత్నించకండి వారిని స్వేచ్చగా వదిలేయండని వెల్లడించారు. అప్పుడే వారు అభివృద్ధి చెందుతారని అభిప్రాయపడ్డారు. ఆర్మీలో ఉన్నత వర్గాల వారి ప్రాతినిత్యం పెరగాలని అభిప్రాయపడ్డారు.