నిబద్ధత కలిగిన బార్బర్ ఏం చేశాడో చూడండి... (Video)

గురువారం, 12 అక్టోబరు 2017 (06:03 IST)

barber

మనం చేసే పనిపై శ్రద్ధతోపాటు ఎంతో నిబద్ధత ఉండాలని పెద్దలు చెపుతుంటారు. అపుడే చేసే పనిలో ఆశించిన ప్రతిఫలం పొందవచ్చని అంటుంటారు. అలాగే, కెనడాకు చెందిన ఓ బార్బర్.. తాను చేసే పనిపై ఎంత నిబ‌ద్ధ‌తతో ఉన్నాడో ఈ కథనం చదివితే మీకే తెలుస్తుంది. అతని నిబద్ధత ప్ర‌పంచవాసులందరినీ ఇట్టే క‌ట్టిప‌డేస్తోంది. 
 
ఇందుకుసంబంధించిన ఫొటో ఒక‌టి విప‌రీతంగా సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అందులో ఓ అల్ల‌రి పిల్లాడికి స‌ద‌రు బార్బ‌ర్ క‌టింగ్ చేసేందుకు నేల‌పై ప‌డుకోవాల్సి వ‌చ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలను పరిశీలిస్తే... జ‌కాంబ్ అనే బార్బర్ వ‌ద్ద‌కు ఓ మ‌హిళ త‌న కుమారుడిని తీసుకొని వ‌చ్చి హెయిర్ క‌టింగ్ చేయ‌మ‌ని కోరింది.
 
పైగా, ఆ బాలుడికి వినికిడి శ‌క్తిలేదు. మాట్లాడ‌నూ లేడు. ప్ర‌తిసారి ఆ మ‌హిళ త‌న కుమారుడిని ఆ బార్బ‌ర్ వ‌ద్ద‌కే తీసుకెళ్తుంది. ఆ బాలుడు ఎవ‌రి మాటా వినిపించుకోకుండా విప‌రీతంగా అల్ల‌రి చేస్తూ ఉంటాడు. హెయిర్ క‌టింగ్ చేసే స‌మ‌యంలో ఆ బాలుడు కుదురుగా కూర్చోడు. ప్ర‌తిసారి త‌న వ‌ద్ద‌కే ఆ బాలుడు వ‌స్తుండ‌డంతో ఆ బాలుడు ఆ బార్బ‌ర్‌కి ఓ ఫ్రెండ్ అయిపోయాడు.  
 
కటింగ్ సమయంలో ఒక్కోసారి ఆ బాలుడు కుర్చీలో కూర్చోకుండా... ఆ క‌టింగ్ షాపంతా తిరుగుతూ ఉంటాడు. ఆ బాలుడి వెన‌కే వెళ్లి ఆ బార్బ‌ర్ క‌టింగ్ చేస్తుంటాడు. అయితే, తాజాగా ఆ బాలుడు మ‌రోలా ప్ర‌వ‌ర్తించాడు. త‌న తల్లి క‌టింగ్ షాప్‌కి తీసుకురాగానే అందులోనే నేల‌పై బోర్లా ప‌డుకున్నాడు. దీంతో ఆ బాలుడికి అక్క‌డే క‌టింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ఆ బార్బ‌ర్.. తాను కూడా నేలపై పడుకుని అక్క‌డే కటింగ్ చేసేశాడు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటోలకి ఎన‌లేని స్పంద‌న వ‌స్తోంది.
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కింద 6 నెలల్లో 20 లక్షల మరుగుదొడ్లు నిర్మాణం

అమరావతి: రాష్ట్రంలో స్వఛ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద ఆరు ...

news

8 జాతీయ, అంతర్జాతీయ స్కూళ్లకు 32 ఎకరాలు... మంత్రి నారాయణ

అమరావతి : అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 జాతీయ, అంతర్జాతీయ పాఠశాలలకు రాష్ట్ర ...

news

తిరుపతి విమానాశ్రయంలో కలకలం.. ఎస్పీవై రెడ్డి బావమరిది ఏం చేశాడంటే...

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఎంపి ఎస్పీవై. రెడ్డి బావమరిది రామ్మోహన్ ...

news

5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం... మంత్రి సోమిరెడ్డి

అమరావతి : రాబోయే అయిదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం చేపట్టనున్నట్లు రాష్ట్ర ...