శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 11 జులై 2016 (13:24 IST)

బేకరీలో మద్యం పార్టీ ఇచ్చాడు... యజమాని కాబోయి భిక్షగాడయ్యాడు.. ఎలా?

తొందరపాటుతనం... పెను నష్టాన్ని కలుగజేస్తుందనడానికి ఓ వ్యక్తి జీవితమే ఉదాహరణ. రోడ్డులో భిక్షగాడిగా కాలం వెల్లబుచ్చుతున్న ఓ అభాగ్యుడికి లక్ష్మీ దేవి తలుపు తడుతుంటే... అతడు చేసిన మూర్ఖపు పనులు మళ్లీ అతడి

తొందరపాటుతనం... పెను నష్టాన్ని కలుగజేస్తుందనడానికి ఓ వ్యక్తి జీవితమే ఉదాహరణ. రోడ్డులో భిక్షగాడిగా కాలం వెల్లబుచ్చుతున్న ఓ అభాగ్యుడికి లక్ష్మీ దేవి తలుపు తడుతుంటే... అతడు చేసిన మూర్ఖపు పనులు మళ్లీ అతడిని రోడ్డులో పడేలా చేశాయి. ఆ వివరాలను పరిశీలిస్తే... 
 
పారిస్‌కి చెందిన జెరొమి అవ్‌కంట్‌ వ్యక్తి రోడ్డుల్లో భిక్షమెత్తుకుంటూ జీవనం గడిపేవాడు. అతని దీనస్థితిని చూడలేక అదే ప్రాంతంలో ఉన్న ఓ బేకరీ యజమాని 62 ఏళ్ల మైకేల్‌ ఫ్లమంట్‌ ప్రతీ రోజు అతనికి టీ.. బిస్కెట్‌ ఇస్తూ సాయం చేసేవాడు. ఓ రోజు మైకేల్‌ బేకరీలో పని చేసుకుంటుండగా.. మైక్రోవొవెన్‌ కాలిపోయి కార్బన్‌ మోనాక్సైడ్‌ లీక్‌ అయింది. మైకేల్‌ అందులో చిక్కుకోవడం గమనించిన జెరొమి.. ఎమర్జెన్సీ సర్వీస్‌కు సమాచారం అందించి అతని ప్రాణాలు కాపాడాడు. తన ప్రాణాలను కాపాడిన జెరొమికి తన బేకరీలోనే ఉద్యోగం ఇచ్చాడు మైకేల్. దీంతో జెరొమి కూడా తన భిక్షాటన వదిలేసి చక్కగా ఉద్యోగం చేసుకుంటూ వ్యాపార లావాదేవీల గురించి తెలుసుకున్నాడు. 
 
జెరొమి పనితనాన్ని మెచ్చిన మైకేల్‌ తన వ్యాపారాన్నిమొత్తం కేవలం ఒక్క యూరోకే అమ్మేయడానికి నిర్ణయించుకున్నాడు. 2017లో వ్యాపారమంతా అతనికే ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అయితే జెరొమి అత్యుత్సాహం.. మూర్ఖత్వం మొదటికే మోసం తెచ్చింది. బేకరీ తన సొంతం కాబోతుందన్న గర్వంతో తన తోటి వీధి స్నేహితులను పిలిపించుకొని బేకరీలోనే మద్యం పార్టీని ఏర్పాటు చేశాడు. 
 
అనంతరం ఫుల్లుగా మందు సేవించి రచ్చ రచ్చ చేశారు. తాగిన మైకంలో మైకేల్‌ను అసభ్యంగా తిట్టడంతో పాటు.. అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో కోపం కట్టలు తెంచుకున్న మైకేల్‌ వెంటనే బేకరీలోంచి వెళ్లిపోమ్మని జెరొమికి తేల్చిచెప్పాడు. దీంతో జెరొమి మళ్లీ వీధిన పడ్డాడు. జెరొమి తొందరపాటుతో ఉన్న ఉద్యోగం.. వచ్చే వ్యాపారం పోయి మళ్లీ భిక్షాటన చేయాల్సిన పరిస్థితికి వచ్చేశాడు.