శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (10:48 IST)

మూసా వెనుక ఎవరున్నారు...? ఆ డ్రగ్స్‌ను వెలికితీసే డాక్టర్ ఎవరు?

కడుపు నిండా డ్రగ్ క్యాప్సుల్స్‌ను పెట్టుకుని హైదరాబాద్‌లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా మహిళ వెనుక ఎవరున్నారు.? అసలు ఆమెను ఇక్కడికి ఎవరు పంపారు.? ఇక్కడకు వచ్చిన తరువాత వాటిని బయటకు తీసేవారెవరు? ఆ డ్రగ్స్ ఎక్కడకు చేరుతాయి.? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఆమె కడుపులోంచి ఇప్పటి వరకూ 51 క్యాప్సుల్స్‌ను వెలికి తీశారు. పోలీసులు విచారణ వేగం చేస్తున్నారు.
 
దక్షిణాఫ్రికా మహిళ రెండు రోజుల కిందట మూసా అనే మహిళ డ్రగ్స్ ప్యాకెట్స్‌ను కడుపులో పెట్టుకుని హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో దిగారు. అయితే ఆ ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమెను పరీక్షించిన డాక్టర్లు సోమవారం దాదాపు 40 క్యాప్పుల్స్ బయటకు తీశారు. ఆపై 11 క్యాప్సుల్స్‌ను వెలికి తీశారు. మరోమారు స్కానింగ్ చేసిన తరువాత నిర్ధారణ చేసుకుని ఆమెను డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పారు. 
 
మరోవైపు పోలీసులు వివిధ కోణాలలో విచారణ మొదలు పెడుతున్నారు. ఆమె హైదరాబాద్ నగరంలో ఎక్కడకు వెళ్ళతారు. హైదరాబాద్ నగరంలో ఆమె కడుపులోంచి డ్రగ్స్‌ను ఎవరు వెలికి తీస్తారనేది ప్రశ్న. ఏ డాక్టర్ల‌తో ఒప్పందం కుదిరిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆమె పేరుతో సెప్టెంబర్ 10 దుబాయికి తిరుగు ప్రయాణం అయ్యేలా టికెట్లు కూడా బుక్కయ్యాయి. 
 
మరి ఇక్కడ నుంచి కేవలం మనిషి మాత్రమే వెళ్లతారా..? లేక ఏమైనా ఇదే తరహాలో తీసుకెళ్ళతారా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఆమె వెనుక ఎవరున్నారనే అంశాలను తెలుసుకోవడానికి ఆమెను విచారణ చేయనున్నారు.