మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (10:06 IST)

ఇరాన్ అణు ఒప్పందం యెమెన్‌కు ముప్పు : ఇజ్రాయేల్

ఇరాన్‌తో ఆరు అగ్రరాజ్యాలు కుదుర్చుకునే అణు ఒప్పందం వల్ల యెమెన్ దేశానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఇజ్రాయేల్ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఇదే అంశంపై జెరూసలెంలో ఆయన మాట్లాడుతూ... ఇరాన్‌తో అగ్రరాజ్యాలు కుదుర్చుకునే ఒప్పందం పరోక్షంగా యెమెన్ ఆక్రమణకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 
 
ఇదే జరిగితే తాము చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. తమ ఆందోళనకు కారణం లేకపోలేదన్నారు. యెమెన్‌లో షియా తిరుగుబాటుదారులకు ఇరాన్ బహిరంగంగానే మద్దతిస్తోందని, ఈ ఒప్పందమంటూ జరిగితే షియాలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 
తర్వాత చోటుచేసుకునే ఎలాంటి పర్యవసానాలకైనా తాము సిధ్ధంగా ఉన్నామన్నారు. కాగా, స్విట్జర్లాండ్‌తో ఇరాన్ అణు కార్యక్రమంపై ఆ దేశంతో అగ్రరాజ్యాలు చర్చిస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్‌తో శాంతియుత ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై నెతన్యాహూ వ్యాఖ్యలు భవిష్యత్ పరిణామాలపై ఆసక్తి రేపుతున్నాయి.